Chiranjeevi, Sreeja, wedding, Pawan kalyan, stills

Chiranjeevi busy in sreeja marriage

Chiranjeevi daughter Sreeja marriage updates, Chiranjeevi daughter Sreeja second marriage details, Sreeja second marriage details, Chiranjeevi daughter Sreeja marriage, Chiranjeevi daughter Sreeja wedding details, Marriage in Mega family, Mega Family, Sreeja marriage, chiranjeevi

Chiranjeevi busy in Sreeja marriage: Megastar Chiranjeevi younger daughter sreeja second marriage updates, details, stills, gallery.

శ్రీజ పెళ్లి పనుల్లో మెగాస్టార్ సందడి

Posted: 02/12/2016 10:48 AM IST
Chiranjeevi busy in sreeja marriage

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ వేడుకలో అన్ని కార్యక్రమాలను చిరంజీవి దగ్గరుండీ మరీ చూసుకుంటున్నాడు. ఇప్పటికే చిరంజీవి ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో చాలా సందడి వాతావరణం నెలకొంది.

పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిరంజీవి తన చిన్న కూతురు శ్రీజను చిత్తూరుకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లి జరుగనుంది. అలాగే రేపు సాయంత్రం వరకే మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు, రాంచరణ్, బన్నీ, సాయిధరమ్ తేజ, వరుణ్ తేజలు తమ సినిమా షూటింగ్ లకు బ్రేక్ చెప్పి.. పూర్తిగా ఈ పెళ్లి సందడిలో పాల్గొననున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ పెళ్లి వేడుకలో చిరంజీవి కుడిచేయికి ఏదో కట్టుకట్టడం వల్ల కాస్త వెలితిగా కనిపిస్తుంది. ఇక ఈ పెళ్లి వేడుకలో పవన్ కళ్యాణ్ పాల్గొంటాడా లేక నేరుగా పెళ్లి మండపంలోనే కలుస్తాడా అనే విషయం త్వరలోనే తెలియనుంది. ఈ వేడుకకు సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారథులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, హిందీ సినీ తారలు విచ్చేయనున్నట్లుగా తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Sreeja  Marriage  Pawan kalyan  stills  

Other Articles