Shah Rukh Khan | refunds | Dilwale | losses | Stills

Shah rukh khan refunds of dilwale loss

Shah Rukh Khan refunds 50 percent of Dilwale loss, Shah Rukh Khan refunds 50 percent, Shah Rukh Khan Dilwale loss, Shah Rukh Khan tweets, Shah Rukh Khan latest news, Shah Rukh Khan stills, Shah Rukh Khan movies

Shah Rukh Khan refunds of Dilwale loss: Shah Rukh Khan's much-hyped Dilwale didn't quite live up to expectations at the domestic box office.

‘దిల్ వాలే’ నష్టాలకు అండగా బాద్ షా నిర్ణయం

Posted: 02/05/2016 01:19 PM IST
Shah rukh khan refunds of dilwale loss

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, కాజోల్ చాలా కాలం తర్వాత జోడికట్టిన ‘దిల్ వాలే’ చిత్రం ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ విడుదలయ్యాక ఘోర పరాజయం పాలయ్యింది. దీంతో ఈ సినిమా కొనుకున్న బయ్యర్స్ చాలా నష్టపోయారు.

దీంతో బయ్యర్స్ నష్టాన్ని తెలుసుకున్న షారుక్.. నష్టపోయిన దాంట్లో యాభై శాతం తిరిగివ్వడానికి ముందుకొచ్చాడు. ‘దిల్ వాలే’ సినిమా వల్ల తాము నష్టపోయామని, తమ నష్టాలను భర్తీ చేయాలంటూ ఎవరు కూడా ఆందోళనకు దిగలేదు. కానీ తన సినిమా వల్ల నష్టపోయిన బయ్యర్స్ కష్టం తెలుసుకొని షారుక్ తనంతట తానుగా ముందుకొచ్చాడు.

50 శాతం నష్టాలు షేర్ చేసుకుంటానని షారుక్ మాటిచ్చాడు. ఇప్పటివరకు బాలీవుడ్ లో ఇలా ముందుకొచ్చినవారే లేరు. షారుక్ ఇలాంటి నిర్ణయం తీసుకొని మరోసారి బాలీవుడ్ బాద్ షా గా అందరి హృదయాల్లో మంచి పేరును తెచ్చుకున్నాడు. హ్యాట్సాఫ్ టు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Dilwale loss  Refunds  Movies  Stills  

Other Articles