Vijay | Theri | Teaser | Samantha | Amy Jackson | Stills

Vijay theri movie official teaser

Vijay Theri Official Teaser, Vijay Theri Trailer, Theri Teaser, Vijay Theri Posters, Vijay Theri stills, Vijay Theri movie news, Vijay Theri movie updates, Vijay Theri movie details, Vijay Theri shooting details, Vijay Theri

Vijay Theri Movie Official Teaser: Vijay's latest film with director Atlee, Theri is directed by Atlee and stars Vijay with actresses Samantha and Amy Jackson in lead roles.

విజయ్ ‘థేరి’ టీజర్ అదిరిందిరోయ్

Posted: 02/05/2016 11:15 AM IST
Vijay theri movie official teaser

ఇళయథలపతి విజయ్ హవా మళ్లీ మొదలయ్యింది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘థేరి’. ‘రాజా రాణి’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతునన్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను సమర్పణలో వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్.థాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఫోటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో విజయ్ రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్నాడు. ఇదిలా వుంటే తాజాగా విడుదలైన ‘థేరి’ టీజర్ యూట్యూబ్ లో దుమ్ముధులుపుతోంది. ఈ టీజర్ ను ఇప్పటికే 760,950 మంది వీక్షించారు.

ఇందులో విజయ్ రెండు విభిన్న పాత్రలో నటిస్తున్నాడు. ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా.. మరొకటి చిన్నపిల్లాడి మనస్తత్వం కలిగిన పాత్రగా కనిపిస్తోంది. రెండు గెటప్ లలో విజయ్ యాక్టింగ్ అదుర్స్ అనిపించేలా వున్నాయి. ఈ సినిమాకు జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ సరసన సమంత, అమీ జాక్సన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు విజయ్ నటించిన పలు చిత్రాలు తెలుగులో విడుదలయ్యి, మంచి విజయం సాధించాయి. అయితే ‘థేరి’ చిత్రాన్ని కూడా తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వర్షెన్ కోసం ‘మెరుపు’ టైటిల్ ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Theri  Teaser  Posters  samantha  Amy Jackson  

Other Articles