Nani | Jai Balayya | Tattoo | Hanu Raghavapudi

Nani gets jai balayya tattoo on hand

Nani gets Jai Balayya Tattoo, Nani Jai Balayya movie shooting updates, Nani next film title Jai Balayya, Nani new movie launched, Nani movie launched, Nani 14 reels movie launch, Nani new movie launch stills, Nani movie updates, Nani movie stills, Nani movie news, Nani

Nani gets Jai Balayya Tattoo on hand: Nani upcoming film under Hanu Raghavapudi direction. 14 Reels Entertainments Banner. Movie Shooting in Ananthapoor dist.

భారీ క్రేజ్ దక్కించుకున్న ‘జై బాలయ్య’ టాటూ

Posted: 11/28/2015 11:04 AM IST
Nani gets jai balayya tattoo on hand

‘భలే భలే మగాడివోయ్’ తర్వాత నాని హీరోగా ‘అందాల రాక్షసి’ ఫేం దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు రామ్ ఆచంట – గోపి ఆచంట – అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరకుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాలో నాని అనంతపూర్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాత్రలో కనిపించనున్నాడు.. అందువల్ల ఈ చిత్రానికి ‘జై బాలయ్య’ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా కోసం నాని తన చేతిమీద ‘జై బాలయ్య’ అనే ఓ టాటూను కూడా వేయించుకున్నాడు.

Nani gets Jai Balayya Tattoo-02

ప్రస్తుతం ఈ టాటూకి భారీగా క్రేజ్ పెరిగిపోయింది. నిన్న ‘సైజ్ జీరో’ సినిమా ప్రీమియర్ షోకు నాని వెళ్లాడు. అక్కడ నాని చేతిపై వున్న ఈ టాటూ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బాలయ్య అభిమానులంతా ఈ టాటూను వేయించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొత్తానికి నాని తన ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటినుంచే ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Jai Balayya  Tattoo  Hanu Raghavapudi  14 Reels Entertainments  

Other Articles