Tamil Film Directors | Donate their bodies | Movie news

Tamil directors ready to donate their bodies

Tamil Film Directors ready to donate their bodies for research, Tamil Film Directors ready to donate, Tamil Film Directors signup for donate, Tamil Film Directors, Tamil Directors donate bodies for research, tamil movie news, stills

Tamil Directors ready to donate their bodies: Tamil film director association group 62 members sign up to donate their bodies for research after death.

పరిశోధనల కోసం 62 మంది దర్శకుల శరీరదానం

Posted: 11/25/2015 09:42 AM IST
Tamil directors ready to donate their bodies

తమిళ సినిమా దర్శకనిర్మాతలు ఎప్పుడు కూడా కలిసే వుంటారని మరోసారి నిరూపించారు. అందులో భాగంగా తాజాగా తమిళ చిత్ర దర్శకుల సంఘం ఓ భారీ నిర్ణయం తీసుకుంది. మనిషి చనిపోయిన అనంతరం.. ఆ వ్యక్తికి సంబంధించిన అవయవాలను కూడా చాలా మంది బూడిదపాలే కానిస్తుంటారు. ఎవరో కొంతమంది మాత్రమే అవయవదానం చేయడానికి ముందుకొస్తుంటారు.

అయితే తమిళ దర్శకుల సంఘంవారు పరిశోధనల కోసం తమ మరణానంతరం శరీరాలను దానం చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో 62 మంది సభ్యులు వుండటం విశేషం. ఈ విషయంపై మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను తమిళనాడు చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, కెఎస్ రవికుమార్, వాసు, ఆర్కే సెల్వమణి తదితరులు కలిసి అంగీకార పత్రాలను అందజేసారు. ఈ దర్శకుల సంఘ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని జయలలిత అభినందించారు.

ఈ సంధర్భంగా విక్రమన్ మాట్లాడుతూ... ప్రముఖ నటుడు కమల్ హాసన్ గారిని స్పూర్తిగా తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. పరిశోధన కోసం శరీరాన్ని దానం చేయాలని దర్శకుల సంఘం వార్షిక సర్వసభ్య సమావేశాల్లో తాను వెల్లడించగా, అందరూ సానుకూలంగా స్పందించారని విక్రమన్ చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Film Directors  donate their bodies  movie news  stills  

Other Articles