Anushka | Size Zero | Censor Report | Release date

Size zero movie 1kg gold contest

Anushka Size Zero Movie Gold Contest, Anushka Size Zero Movie Censor Report, Anushka Size Zero Release date, Anushka Size Zero Latest Posters, Anushka Size Zero movie news, Anushka Size Zero movie updates, Anushka Size Zero stills, Anushka Size Zero, Anushka, Size Zero

Size Zero Movie 1kg Gold Contest: Starring Arya, Anushka Shetty, Sonal Chauhan, Prakash Raj, Urvashi, Bharat and others, Anushka Size Zero movie Release on 27 November.

కిలో బంగారం కావాలా నాయనా... ‘సైజ్ జీరో’ చూడమంటున్న అనుష్క!

Posted: 11/23/2015 05:40 PM IST
Size zero movie 1kg gold contest

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన ‘సైజ్ జీరో’ సినిమా ఈనెల 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసారు. అంతేకాకుండా ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకుల థియేటర్లకే వచ్చేందుకు చిత్ర నిర్మాతలు ఓ బంగారం ప్లాన్ వేసారు.

అదేంటంటే.. ‘‘సైజ్ జీరో’ సినిమా చూడండి... 1 కిలో బంగారం గెలవండి’ అనే కాంటెస్ట్ ను ఏర్పాటుచేసారు. ‘సైజ్ జీరో’ సినిమా ప్రదర్శించబడే థియేటర్లలో టికెట్ తో పాటు ఓ కూపన్ ను కూడా ఇవ్వనున్నారు. ఈ కూపన్ కోడ్ ను 95454 66666కి SMS గానీ లేదా www.pvpcinema.com అనే వెబ్ సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.

కానీ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ బంగారం ఇచ్చే కాంటెస్ట్ కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వారాల పాటు ఈ సినిమా చూసిన ప్రేక్షకులలో ఇరవై మందిన ఎంపిక చేసి, అందులో ఒకరికి మాత్రమే కిలో బంగారాన్ని ఇవ్వనున్నట్లుగా నిర్మాత ప్రసాద్.వి.పోట్లూరి ప్రకటించారు. పైరసీని ఎలాగో ఆపలేకపోతున్నాం కాబట్టి.. కనీసం ఇలాగైనా ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించే చిరుప్రయత్నమని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చారు.

అనుష్క, ఆర్య, ఊర్వశి, సోనాల్‌ చౌహాన్‌, ప్రకాష్‌ రాజ్‌, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, అడవిశేష్‌, పోసాని కృష్ణమురళి, భరత్‌, బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, డైలాగ్స్‌: కిరణ్‌ కుమార్‌, సాహిత్యం: అనంత్‌ శ్రీరామ్‌, శ్రీమణి, యం.యం.కీరవాణి, ఆర్ట్‌: ఆనంద్‌ సాయి, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డ్యాన్స్‌: రాజుసుందరం, బృంద, ఫిరోజ్‌ఖాన్‌, కాస్ట్యూమ్స్‌: ప్రశాంత్‌, కథ, స్క్రీన్‌ప్లే: కణిక థిల్లాన్‌ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: సందీప్‌ గుణ్ణం, నిర్మాత: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్ అన్నే, దర్శకత్వం: ప్రకాష్‌ కోవెలమూడి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Size Zero  Censor Report  Release date  Trailers  

Other Articles