శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ, రకూల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రూస్ లీ’. తమిళంలో ఈ చిత్రాన్ని ‘బ్రూస్ లీ2’ పేరుతో విడుదల చేయబోతున్నారు. తమిళంలో భద్రకాళి ఫిల్మ్స్ అధినేత భద్రకాళి ప్రసాద్ విడుదల చేయనున్నారు.
థమన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తోంది. అయితే ఈ చిత్ర తమిళ వర్షెన్ ఆడియో విడుదల కార్యక్రమం తాజాగా జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళ దర్శకులు గౌతమ్ మీనన్, రాఘవ లారెన్స్ లతో పాటుగా దర్శకులు శ్రీనువైట్ల, హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా దర్శకులు రాఘవ లారెన్స్ ఆడియో సిడీని విడుదల చేసారు. అలాగే ఈ చిత్ర తమిళ వర్షెన్ థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసారు. అరుణ్ విజయ్ కుమార్, కృతి కర్బందా, నదియా ముఖ్య పాత్రలలో నటించారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more