Amma Rajasekhar | Case filed | Case | Issue | News

Case filed on director amma rajasekhar

amma Rajasekhar, Case filed on Choreographer Amma Rajasekhar, Case filed on Amma Rajasekhar, Amma Rajasekhar latest news, Amma Rajasekhar case issue, Amma Rajasekhar police case, Amma Rajasekhar latest updates, Amma Rajasekhar

Case filed on Director Amma Rajasekhar: Choreographer Amma Rajasekhar latest police case issue. amma Rajasekhar, Case filed on Choreographer Amma Rajasekhar,Case filed on Amma Rajasekhar.

అమ్మరాజశేఖర్ పై న్యూసెన్స్ కేసు నమోదు

Posted: 10/09/2015 12:35 PM IST
Case filed on director amma rajasekhar

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు అమ్మరాజశేఖర్ పై హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. తనపై అనవసరంగా రాజశేఖర్ దాడి చేసారంటూ వెంకటరెడ్డి అనే జిమ్ ట్రైనర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎల్లారెడ్డిగూడలో అమ్మరాజశేఖర్ వుండే ఫ్లాట్ కింది అంతస్థులో వెంకటరెడ్డి అద్దెకు వుంటున్నారు. టీవి సౌండ్ ఎక్కువగా పెడుతున్నారనే విషయంలో అమ్మరాజశేఖర్-వెంకటరెడ్డిల మధ్య ఇటీవలే చిన్నపాటి ఘర్షణ జరిగింది. దీంతో వెంకట్ తన ఇంటిని ఖాళీ చేసాడు.

Video Courtesy: TV9Telugu Live

అయితే అద్దె ఇంట్లో మిగిలి వున్న తన వస్తువులు తెచ్చుకునేందుకు తన మిత్రుడితో కలిసి నిన్న అక్కడికి వెళ్లారు వెంకట్ రెడ్డి. అక్కడికి వెళ్లిన తర్వాత అమ్మరాజశేఖర్ వారిద్దరిని తన గదికి పిలిపించి, అకారణంగా వారిపై దాడి చేసాడని బాధితుడు వెంకట్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా పోలీసులు తెలిపారు.

కానీ ఈ విషయంపై అమ్మరాజశేఖర్ స్పందన మరో విధంగా వుంది. ఈ విషయంపై అమ్మరాజశేఖర్ స్పందిస్తూ... తాను ఎవరిపై దాడి చేయలేదని, ఆ జిమ్ ట్రైనర్ ఎలాంటి కారణం లేకుండానే తన కార్ డ్రైవర్ ను కొట్టాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amma Rajasekhar  Case filed  Case  Issue  News  

Other Articles