Sonam Bajwa | Sushanth | movie news | hot stills

Sushanth to romance sonam bajwa

Sonam Bajwa to romance Sushanth, Sonam Bajwa latest stills, Sonam Bajwa latest news, Sonam Bajwa telugu film, Sonam Bajwa movie updates, Sonam Bajwa movie news, Sonam Bajwa hot stills, Sushanth

Sushanth to romance Sonam Bajwa : Tollywood actor Sushanth upcoming film under G. Nageshwara reddy Direction. Sonam Bajwa heroine.

‘పాండవుల్లో ఒకడు’ భామతో సుశాంత్ రొమాన్స్

Posted: 10/09/2015 11:34 AM IST
Sushanth to romance sonam bajwa

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుశాంత్ గతకొద్ది కాలంగా సినిమా ప్రేక్షకులకు దూరంగానే వుంటున్నాడు. తను నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా అట్టర్ ఫ్లాప్స్ అవుతుండటంతో కొంతకాలం విరామం తీసుకున్నాడు. సుశాంత్ నటించిన ఆఖరి చిత్రం ‘అడ్డా’.

ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో తన కొత్త సినిమా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని మరొ రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో సుశాంత్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

ఇందులో సుశాంత్ సరసన పంజాబీ ముద్దుగుమ్మ సోనమ్ బజ్వానీ హీరోయిన్ గా ఖరారు చేసారు. సోనమ్ బజ్వా ఇటీవలే వచ్చిన ‘పాండవుల్లో ఒకడు’ (తమిళం డబ్బింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. సోనమ్ కు ఇదే తొలి తెలుగు సినిమా.

ఈ చిత్రాన్ని నాగ సుశీల - చింతలపూడి శ్రీనివాస రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆటాడుకుందాం రా’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonam Bajwa  Sushanth  movie news  hot stills  

Other Articles