Rudhramadevi | Allu Arjun | Movie Review | Anushka | Rana | Public talk

Allu arjun rocking performance as gona gannareddy in rudhramadevi film

Allu Arjun Major Highlights in Rudhramadevi film, Allu Arjun Highlight in Rudhramadevi film, Allu Arjun in Rudhramadevi film, Rudhramadevi movie review, Rudhramadevi public talk, Rudhramadevi movie updates, Rudhramadevi movie details, Rudhramadevi stills, Rudhramadevi

Allu Arjun rocking performance as gona gannareddy in Rudhramadevi film: Stylish star allu arjun latest film Rudhramadevi. This film released today. allu arjun play in gona gannareddy role. anushka, rana acts in lead roles.

గోనగన్నారెడ్డిగా థియేటర్లలో మోతమోగిస్తున్న స్టైలిష్ స్టార్

Posted: 10/09/2015 11:18 AM IST
Allu arjun rocking performance as gona gannareddy in rudhramadevi film

ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ‘రుద్రమదేవి’ చిత్రం ఎట్టకేలకు నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై థియేటర్లలో సందడి చేస్తుంది. గుణా టీం వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ దర్శకనిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో అందాల భామ అనుష్క, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దగ్గుబాటి రానాలు ప్రధాన పాత్రలలో నటించారు.

సినిమా విడుదలకు ముందు ‘రుద్రమదేవి’కి అనుష్క, రానాలు మాత్రమే హైలెట్ గా నిలుస్తారని అందరూ భావించారు. కానీ సినిమా విడుదలయ్యాక ఆ క్రెడిట్ మొత్తం కూడా స్టైలిష్ స్టార్ కొట్టేసాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్రలో అదరగొట్టేసాడు. గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ చెప్పిన తెలంగాణ యాస డైలాగ్స్ లకు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి.

అల్లు అర్జున్ తన లుక్స్, హవభావాలతో, డైలాగ్స్ లతో ఆకట్టుకున్నాడు. సినిమాకు గోనగన్నారెడ్డి పాత్ర మేజర్ హైలెట్ గా నిలిచింది. రుద్రమదేవికి పోటీగా గోనగన్నారెడ్డి పాత్ర వుండటం, ఆ పాత్రలో అల్లు అర్జున్ జీవించేసి సినిమాకు ప్రధానాకర్షణగా నిలవడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో వున్నారు.

ఫస్ట్ హాఫ్ లో కొంతసేపు మాత్రమే కనిపించిన గోనగన్నారెడ్డి.. సెకండ్ హాఫ్ లో మాత్రం తన యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టేసాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో బన్నీ గుర్రపు స్వారీ, యాక్షన్ సీన్లలో చింపేసాడు. గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ ప్రేక్షకులకు మరింత జోష్ ను తీసుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Rudhramadevi  Allu Arjun  Movie Review  Anushka  Rana  Public talk  

Other Articles