Ajith | Vedalam | Trailer | shruti haasan | stills

Ajith vedalam movie trailer released

Ajith Vedalam Movie Trailer, Vedalam Movie Trailer, Vedalam Movie stills, Vedalam Movie news, Vedalam Movie updates, Vedalam Movie details, Vedalam trailer, Ajith, Shruti haasan, Lakshmi menon

Ajith Vedalam Movie Trailer Released: Tamil star hero thala ajith latest film Vedalam. Siva director. Shruti haasan heroine. lakshmi menon acts in important role. anirudh music.

అదిరిపోయిన అజిత్ ‘వేడలం’ ట్రైలర్

Posted: 10/08/2015 10:33 AM IST
Ajith vedalam movie trailer released

తమిళ స్టార్ హీరో థలా అజిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వేడలం’. ప్రముఖ దర్శకుడు శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సాయిరాం క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. ఐశ్వర్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ చాలా స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్ గా రూపొందించారు. ఈ ట్రైలర్ విడుదలై 24 గంటలు గడవకముందే యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈ వీడియోను 522087 మంది వీక్షించారు.

అజిత్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అజిత్ చెల్లెలి పాత్రలో లక్ష్మీ మీనన్ నటిస్తుంది. ఇది అన్నచెల్లెల మధ్య జరిగే కథాంశంగా రూపొందుతోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajith  Vedalam  Trailer  shruti haasan  stills  

Other Articles