Puri Jagannadh | Rogue Movie | Ishan | Movie News | tweets

Puri jagannadh next film title rogue confirmed

Puri Jagannadh Rogue Movie Latest News, Puri Jagannadh Rogue Movie latest updates, Puri Jagannadh Rogue Movie details, Puri Jagannadh Rogue hero, Puri Jagannadh Rogue, Ishan, Puri Jagannadh Rogue shooting details, Puri Jagannadh, Rogue Movie

Puri Jagannadh Next Film Title Rogue Confirmed: Director Puri Jagannadh Next film Rogue. Ishan introduce as hero. This Movie will be starts from november.

పూరీకి ‘రోగ్’ దొరికేసాడు.. ఇక షూటింగ్ స్టార్ట్!

Posted: 10/06/2015 05:33 PM IST
Puri jagannadh next film title rogue confirmed

‘పోకిరి’, ‘బిజినెస్ మాన్’ చిత్రాల తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు పూరీ జగన్నాథ్ ల కలయికలో రాబోయే చిత్రానికి ‘రోగ్’ అనే టైటిల్ ఖరారు చేసారని గతంలో వార్తలొచ్చాయి. ‘పొకిరీ’ చిత్రానికి సీక్వెల్ గా ‘రోగ్’ తెరకెక్కనుందని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే పూరీ మాత్రం తన రోగ్ మహేష్ బాబు కాదని తేల్చేసాడు.

పూరీ తన తర్వాత చిత్రం ‘రోగ్’ అని ప్రకటించేసాడు. అంతే కాకుండా ఈ సినిమాతో ఇషాన్ అనే కొత్త కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని పూరీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించాడు. ఇషాన్ ఫోటోను కూడా పూరీ పోస్ట్ చేసాడు. ఈ చిత్ర షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుందని పూరీ తెలిపాడు.

Puri Jagannadh Rogue Movie Latest News-02

ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత సి.ఆర్.మనోహర్ తనయుడే ఈ ఇషాన్. సి.ఆర్.మనోహర్ తెలుగులో ‘మహాత్మ’ వంటి పలు చిత్రాలను నిర్మించారు. ఈ ‘రోగ్’ సినిమాతో తన తనయుడిని తెలుగులోకి గ్రాండ్ గా హీరోగా పరిచయం చేయనున్నాడు. మరి ఈ ‘రోగ్’ సినిమా ఎలా వుండబోతుందో త్వరలోనే తెలియనుంది.

ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లోఫర్’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannadh  Rogue Movie  Ishan  Movie News  tweets  

Other Articles