Prabhas | SS Rajamouli | Baahubali | Japan | Collections | Prabhas

Baahubali film ready to release in japan

Prabhas Baahubali Film to Release in Japan, Baahubali film news, Baahubali movie updates, Baahubali film collections, Baahubali reviews, Baahubali collections report, Baahubali latest updates, Baahubali news, Baahubali latest posters, Baahubali interviews, Baahubali

Baahubali Film Ready to Release in Japan: SS Rajamouli latest block buster hit film Baahubali. Prabhas, Rana, Tamanna, Anushka, Ramyakrishna acts in lead roles.

చైనా తర్వాత జపాన్ పై కన్నేసిన ‘బాహుబలి’

Posted: 10/05/2015 04:52 PM IST
Baahubali film ready to release in japan

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి - ది బిగెనింగ్’ చిత్రం ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అన్ని బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టి, కొత్త రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించింది.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడుతోంది. మరికొద్ది రోజుల్లోనే చైనాలో విడుదల చేయనున్నారు. చైనాలో ‘బాహుబలి’ చిత్రాన్ని ‘స్టార్స్ ఫిస్’ అనే సంస్థ విడుదల చేయనుంది. ఇంటర్నేషనల్ స్టైయిల్ కు తగ్గట్లుగా కాస్త ఎడిటింగ్ చేయించారు. త్వరలోనే చైనాలో విడుదల కానుంది.

చైనా తర్వాత ‘బాహుబలి’ చిత్రాన్ని జపాన్ లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జపాన్ తో ఆగిపోకుండా మిగతా దేశాల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రానా, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్, అనుష్క, నాజర్, ప్రభాకర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించగా, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  SS Rajamouli  Baahubali  Japan  Collections  Prabhas  

Other Articles