మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ, రకూల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రూస్ లీ - ది ఫైటర్’. ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు.
థమన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే విడుదలైన థియేటర్ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లు కథను అందిస్తున్నారు.
ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల చేయనున్నారు. తమిళంలోకి ‘బ్రూస్ లీ2’ పేరుతో విడుదల చేయనున్నారు. ‘బ్రూస్ లీ2’ ఆడియోని అక్టోబర్ 7న చెన్నైలో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్ర తమిళ డిస్ట్రిబ్యూటర్ భద్రకాళి ఫిల్మ్స్ అధినేత భద్రకాళి ప్రసాద్ తమిళ్ లో గ్రాండ్ గా ఆడియో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
ఈ ఆడియో వేడుకకు తమిళ స్టార్ హీరో హాజరు కానున్నట్లుగా తెలిసింది. పవర్ ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి టిస్కా చోప్రా ఇందులో ఓ కీలక పాత్రలో నటించనుంది.
కృతి కర్బందా, నదియా ముఖ్య పాత్రలలో నటించారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more