nagarjuna and karthi sky diving for oopiri movie

Nagarjuna and karthi goes for dangerous stunts for oopiri

Akkineni Nagarjuna,Nagarjuna, Nagarjuna latest news, Nagarjuna karthi movie, Nagarjuna photos, Nagarjuna movie collections, Akkineni Nagarjuna karthi oopiri movie, Akkineni Nagarjuna latest updates, Akkineni Nagarjuna movie news, Akkineni Nagarjuna cinema News, Akkineni Nagarjuna upcomming movies, Akkineni Nagarjuna new look,

nagarjuna and karthi goes for dangerous stunts for oopiri movie, both perform sky diving stunts

ఊపిరి బిగపట్టుకునేలా అక్కినేని సాహసాలు..

Posted: 10/04/2015 09:09 PM IST
Nagarjuna and karthi goes for dangerous stunts for oopiri

ప్రస్తుతం తెలుగుచిత్ర పరిశ్రమలో యంగ్ హీరోలు రియలిస్టిక్ స్టంట్స్ కు అధిక ప్రాధాన్యమిస్తూ.. దూసుకుపోతున్న తరుణంలో.. వారికేమాత్రం తీసిపోని విధంగా స్టంట్ల చేస్తూ సవాల్ విసురుతున్నాడు టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున. అయితే ఇందుకోసం అదికంగానే కాకుండా అన్ని రకాలుగా కష్టపడుతున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక పాత్రలతో కూడా సత్తా చాటుతున్నాడు. అంతేకాదు ఈ ఏజ్లో కూడా సినిమా కోసం రిస్కీ స్టంట్స్ చేస్తున్నాడు. తాజాగా ఊపిరి సినిమా కోసం కార్తీతో కలిసి ఇలాంటి సాహసమే చేశాడు.

త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా కోసం వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేశారు నాగార్జున, కార్తీ. సినిమాలో కీలక సమయంలో వచ్చే ఓ సీన్ కోసం ఇంత రిస్క్ చేశారు ఈ స్టార్స్. కేవలం 2 రోజులు ట్రైనింగ్ మాత్రమే తీసుకోని ఈ రిస్కీ సీన్ను పూర్తి చేశారు. 'ఫ్రెంచ్ మూవీ ది ఇన్టచబుల్స్'కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున, కార్తీలతో పాటు అనుష్క, తమన్నాలు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి మన నేటివిటికి తగ్గ మార్పులతో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Nagarjuna  karthi  sky diving  oopiri  anushka  Akkineni nag latest updates  

Other Articles