rumors surround in tinsel town that Ileana D'cruz's engagement

Is ileana secretly engaged

Is Ileana secretly engaged?, Ileana, ileana d'cruz engaged, Ileana latest news, Ileana movies, Ileana photos, Ileana movies news, Ileana movie collections, Ileana latest updates, Ileana movie news, Ileana jackie chan offer, Ileana spotted with a costly ring

Now the latest buzz in the tinsel town is that Ileana D’cruz’s engagement because she was recently spotted with a costly ring.

పోడుగు కాళ్ల సుందరికి.. నిశ్చితార్థం అయ్యిందా..?

Posted: 10/04/2015 09:05 PM IST
Is ileana secretly engaged

పొగుడుకాళ్ల సుందరి సగం పెళ్లైపోయ్యిందట. ఇప్పుడిదే వార్త చిత్రపరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సగం పెళ్లి అంటే మాకు అర్థంకాదనుకున్నారా..? నిశ్చితార్దమేగా.. మాకు తెలుసు. అయితే ఎవరితో.. ఎప్పుడు, ఎక్కడ అంటూ ప్రశ్నలు వేయకండీ.. ఇంతకీ పోడుగుకాళ్ల సుందరీ అంటే ఎవరు అని కూడా అగిడేవాళ్లున్నారు. పోగుడు కాళ్ల సుందరీ అంటే గోవా బ్యూటీ ఇలియానా. ఇంతకు ముందు దక్షిణాదిలో మారు మోగిన ఈ పేరు.. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో మారుమ్రోగుతుంది.
 
టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్ కు ఎగుమతైన హీరోయినల్లో ఈమె కూడా ఒకరు.  అయితే ఇప్పుడు అక్కడా సినిమాలు లేవు.ఆస్ట్రేలియాకు చెందిన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూతో జాలీగా షికార్లు కొడుతున్నారనే రకరకాల వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలియానాకు తన ప్రేమికుడు ఆండ్రూతో ఇటీవల వివాహనిశ్చితార్థం  జరిగినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ వేడుకను అత్యంత రహస్యంగా నిర్వహించినట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన ఎవరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని తెలిసింది.
 
అయితే వారి వివాహ నిశ్చితార్థానికి సంబంధించి ఫొటోలు సహా ఏ ఒక్క ఆధారం బయట పడకుండా ఇలియానా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడినట్లు ప్రచారం జరుగుతోంది. మూడు నెలల తరువాత ఇరు వర్గాల కుటుంబ సభ్యులు వివాహ తే దీని  వెల్లడించనున్నట్లు తెలిసింది. ఇంతకీ ఇలియానా వివాహ నిశ్చితార్థం జరిగిందా? అదే నిజమయితే ఆ వేడుకను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ గోవా బ్యూటీకీ ఇంతకుముందెరుగని అదృష్టం మాత్రం వరించింది. హాలీవుడ్ స్టార్, చైనా సూపర్ స్టార్ జాకీచాన్ సరసన నటించే అవకాశాన్ని కోట్టేసింది. దీంతో ఆ చిత్రం పూర్తయ్యేంత వరకు ఈ విషయాన్ని గోప్యంగా వుంచాలని ఇద్దరి తరపువాళ్ల ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bollywood news  tollywood news  iliana  heroine  engaged  

Other Articles