tollywood reowned producer edida nageswara rao no more

Tollywood producer edida nageswara rao passes away

tollywood producer edida nageswara rao, producer edida nageswara rao passes away, producer edida nageswara rao no more, tollywood, producer, edida nageswara rao, passes away

tollywood reowned producer edida nageswara rao passes away today in hospital while undergoing treatment

ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు ఇక లేరు..

Posted: 10/04/2015 08:59 PM IST
Tollywood producer edida nageswara rao passes away

ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు(81) అధివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయాన్ని బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 8లోని ఆయన స్వగృహానికి తరలించారు. 1934లో జన్మించిన ఆయన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి పేరు ప్రఖ్యాతులు గడించారు. ఏడిద మరణవార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. తెలుగు చిత్ర పరిశ్రమలో విషాధచాయలు అలుముకున్నాయి. ఏడిద మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, ఆయన బంధుమిత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

నాగేశ్వరరావు తన పూర్ణోదయ ఆర్ట్స్‌ పతాకంపై తెలుగు చలనచిత్ర రంగానికి అణిముత్యాల లాంటి సినిమాలను అందించారు. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సీతాకోకచిలుక, సాగరసంగమం, సితార, స్వాతిముత్యం, స్వయంకృషి, స్వరకల్పన, ఆపద్భాంధవుడు వంటి ఉత్తమ చిత్రాలను నిర్మించారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ కాంబినేషన్ లోనే ఆరు సినిమాలు నిర్మించి తెలుగు ప్రేక్షకులకు అందించారు. స్వయంకృషి, ఆపద్బాంధవుడు సినిమాల్లో చిరంజీవి హీరో కాగా సాగరసంగమం, స్వాతిముత్యం చిత్రాలలో కమల్ హీరోగా నటించారు. ఆయన నిర్మించిన సినిమాల్లో స్వాతిముత్యం, సీతాకోకచిలుక, సితార, ఆపద్బాంధవుడు, సాగరసంగమం చిత్రాలు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్‌గా నంది అవార్డులను గెల్చుకున్నాయి. వీటితోపాటు మరికొన్ని చిత్రాలు జాతీయ అవార్డులను కూడా దక్కించుకున్నాయి.

పూర్తిగా కళాభిరుచి ఉన్న సాంప్రదాయబద్ధమైన చిత్రాలను నిర్మించి విమర్శకులు ప్రశంసలను నాగేశ్వరరావు సొంతం చేసుకున్నారు. ఆయన నిర్మించిన చిత్రాలు ఆయనకే కాకుండా మొత్తం తెలుగు చిత్రసీమకే గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. పలు చిత్రాలు జాతీయ అవార్డులు, నంది అవార్డులను కూడా సాధించాయి. అంతర్జాతీయ వేదికలపై ఆయన నిర్మించిన చిత్రాలు ప్రదర్శింపబడ్డాయి. కొన్ని చిత్రాలు రష్యా భాషలోకి కూడా అనువాదం అయ్యాయి. రంగస్థల నటుడిగా కెరీర్ను ప్రారంభించిన ఆయన చిత్ర నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రయాణం సాగించి చివరకు సినిమా నిర్మాతగా మారారు. నిర్మాణ రంగం నుంచి వైదొలగిన తర్వాత తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీగా, నంది అవార్డుల కమిటీ చైర్మన్గా, నేషనల్ ఫిల్మ్ అవార్డు కమిటీ సభ్యుడిగా కూడా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood  producer  edida nageswara rao  passes away  

Other Articles