Burning Star Sampoornesh Babu Has Leaked First Look Photo Of Chiranjeevi In Bruce Lee Movie | Srinu Vaitla | Rakul Preet Singh

First look photo leaked sampoornesh babu twitter rakul preet singh

chiranjeevi bruce lee look, chiranjeevi movie updates, chiranjeevi in bruce lee, chiranjeevi bruce lee look leaked, chiru bruce lee look leaked, bruce lee movie posters leaked, chiranjeevi photo gallery, chiranjeevi movie news, chiranjeevi in bruce lee, bruce lee movie updates, ram chran bruce lee

Chiranjeevi Bruce Lee First Look Photo Leaked Sampoornesh Babu Twitter Rakul Preet Singh : Burning Star Sampoornesh Babu Has Leaked First Look Photo Of Chiranjeevi In Bruce Lee Movie.

లీకైన చిరంజీవి ‘బ్రూస్ లీ’ ఫస్ట్ లుక్ ఫోటో

Posted: 10/01/2015 01:47 PM IST
First look photo leaked sampoornesh babu twitter rakul preet singh

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రూస్ లీ’ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే! సినిమాకే హైలైట్ గా నిలవనున్న చిరు పార్ట్ తొలుత 15 నిముషాల నిడివి వుంటుందని అంతా అనుకున్నారు. రచయిత కోన వెంకట్ సైతం చిరు పాత్ర 20 నిముషాల సేపు సాగే పాత్రను క్రియేట్ చేసారని తెలుస్తోంది. పైగా.. ఒక ప్రత్యేక పాటలోనూ చిరు సందడి చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే చిరంజీవి కల్పించుకుని ఈ చిత్రం తన 150వ చిత్రానికి టీజర్ లా ఉండాలని, ఎక్కువ సేపు కనపడటానికి వీల్లేదని చెప్పి, తన పాత్రను కేవలం మూడు నిముషాలకే ట్రిమ్ చేసినట్లు సమాచారం. దాంతో చిరుపై అనుకున్న పాట, డాన్స్ రెండింటిని తీసేసారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఈ సినిమాలోని తన పాత్ర మేరకు షూటింగ్ లో బిజీగా వున్నారు.

‘బ్రూస్ లీ’ సినిమాలో చిరంజీవి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారనే వార్త తెలియగానే.. ఇందులో ఆయన ఎలా కనిపిస్తారోనని ఆసక్తి నెలకొంది. చిత్రబృందం ఆయనకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని అంతా భావించారు కానీ.. శ్రీనువైట్ల రిలీజ్ వరకు చిరు పాత్ర సీక్రెట్ గానే వుంటుందని కుండబద్ధలు కొట్టేశారు. దీంతో ప్రతిఒక్కరు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే.. చిరుకు సంబంధించిన ‘బ్రూస్ లీ’ ఫస్ట్ లుక్ ఫోటో లీకయ్యింది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న ఈ చిరు ఫోటోను ఓ హాస్యనటుడు సీక్రెట్ గా రివీల్ చేశాడు. ఆ హాస్యనటుడు మరెవ్వరో కాదు.. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. తన జీవితంలో కన్న కల నెరవేరిందంటూ చిరు ఫోటోను ట్వీట్ చేశాడు. ‘‘బ్రూస్ లీ’ సెట్ లో చిరంజీవిని కలిసాను. ఎప్పటి నుంచో చిరుని కలవాలి అన్న నా కల నెరవేరింది. చిరంజీవి లుక్ చూస్తూ ఉంటే గ్యాంగ్ లీడర్ లో ఆయన లుక్ గుర్తుకు వచ్చింది’ అంటూ ట్విట్ చేసి తన ఆనందాన్ని తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు. చిరంజీవి తనతో అభిమానంగా మాట్లాడిన ఆ రోజును తాను మరిచిపోలేను అంటూ ఈ బర్నింగ్ స్టార్ చేసిన ట్విట్ ఈరోజు హాట్ టాపిక్.

ఇదిలావుండగా.. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. దానయ్య డీవీవీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గాంధీ జయంత సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన పాటలను హైదరాబాద్ లోని హైటెక్స్ గ్రౌండ్ లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాని అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Related Gallery: Megastar Chiranjeevi Leaked Picture from Bruce Lee Moive

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi bruce lee look  ram charan bruce lee  sampoornesh babu  

Other Articles