Nayanthara | Simbu | Denies | Rumors | news | stills

Simbu clarifies on complaint against nayanthara

Simbu denies complaint against Nayanthara, Simbu denies against Nayanthara, Simbu latest news, Simbu movie news, Simbu latest updates, Simbu stills, Nayanthara latest news, Nayanthara movie news, Nayanthara stills, Nayanthara

Simbu clarifies on complaint against Nayanthara: Kollywood hero simbu upcoming film Idhu namma aalu. nanyanthara heroine.

నయనతార విషయంలో శింబు క్లారిటీ.. ఇదు నమ్మ ఆలు!

Posted: 09/04/2015 12:34 PM IST
Simbu clarifies on complaint against nayanthara

తమిళ హీరో శింబుకు గతకొద్ది కాలంగా దురదృష్టం వెంటాడుతూనే వున్నట్లుగా వుంది. హన్సికతో ప్రేమాయణంకు బ్రేకప్ పడిన తర్వాత శింబు లైఫ్ స్టోరీ మొత్తం మారిపోయింది. శింబు నటించిన పలు సినిమాలు కూడా ఆగిపోయాయి. అయితే శింబు నటించిన ‘వాలు’ సినిమా విడుదల విషయంలో ఏం జరిగిందో.. ప్రస్తుతం శింబు నటిస్తున్న ‘ఇదు నమ్మ ఆలు’ సినిమా విషయంలో అలాగే జరుగుతోంది.

శింబు ఇప్పటికే నయనతార, హన్సికలతో ప్రేమాయణం కొనసాగించి విడిపోయిన విషయం తెలిసిందే. అయితే శింబు, హన్సిక జంటగా నటించిన ‘వాలు’ సినిమా విడుదలకు ముందు... ఓ సాంగ్ షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. కానీ ఈలోపే హన్సిక ఇచ్చిన డేట్స్ అన్నీ కూడా పూర్తయ్యాయి. దీంతో మళ్లీ డేట్స్ కేటాయించడం తన వల్ల కాదని హన్సిక తేల్చేసింది. కానీ మళ్లీ శింబు కోరిక మేరకు హన్సిక ఈ పాటను పూర్తిచేసింది. చివరకు సినిమా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఇక ప్రస్తుత విషయానికొస్తే... శింబు, నయనతార జంటగా నటిస్తున్ తాజా చిత్రం ‘ఇదు నమ్మ ఆలు’. ఈ సినిమా కోసం నయనతార ఇచ్చిన డేట్స్ మొత్తం కూడా పూర్తయ్యాయి. కానీ ఇందులో నయనతార, శింబుల మధ్య మరో పాట చిత్రీకరణ మిగిలిపోయింది. ఈ విషయంపై నయనతారను మళ్లీ డేట్స్ కోసం సంప్రదిస్తే.. ప్రస్తుతం తాను బిజీగా వున్నానని, కాబట్టి డేట్స్ ఇచ్చేది లేదని నయనతార తేల్చి చేప్పేసిందట.

దీంతో ‘ఇదు నమ్మఆలు’ చిత్ర దర్శక నిర్మాతలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో నయనతారపై ఫిర్యాదు చేసినట్లుగా వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై శింబు ఓ క్లారిటీ ఇచ్చేసాడు. నయనతార తమకు డేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లుగా వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఎవరూ కూడా ఎవరిపై కంప్లైంట్ ఇవ్వలేదని శింబు స్పష్టం చేసాడు. అంతేకాకుండా నయనతార తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara  Simbu  Denies  Rumors  news  stills  

Other Articles