farmers file land encroachment complaint against actor madhavan

Case booked on star hero for land grabbing

Case booked on star hero for land grabbing, Madhavan, Popular Tamil star Madhavan has been booked for allegedly encroaching unclaimed, Tamil star Madhavan, Tanu weds Manu

Popular Tamil star Madhavan has been booked for allegedly encroaching unclaimed government land and obstructing irrigation and drinking water source.

మాధవన్.. మా భూములను అక్రమించాడు

Posted: 08/30/2015 05:28 PM IST
Case booked on star hero for land grabbing

దక్షిణాది నుంచి బాలీవుడ్ స్థాయికి ఎదిగిన ప్రముఖ సినీనటుడు మాధవన్‌.. తమిళనాడులోని ఓ గ్రామంలో తమ భూములను కబ్జా చేశాడని జిల్లా కలెక్టర్ కు పిర్యాదు అందింది. తమ పంటపోలాలకు వచ్చే పంట కాలువను ఆక్రమించుకుని విద్యుత్‌ కంచెను ఏర్పాటు చేసుకున్నారని పళని రైతులు దిండుకల్‌ కలెక్టర్‌కు పిర్యాదు చేశారు. అనంతరం పాలసముద్రం ప్రాంతం రైతులు మహాలక్ష్మి, గణేశన్‌ తదితరులు మాట్లాడుతూ పళని సమీపం విలాంకోంపై తేక్కన్‌ తోట ప్రాంతంలో టీటీఎల్‌ పంట కాలువ ఉందనీ, కొడైకెనాల్‌ పర్వతం నుంచి పారే జలాలు ఈ పంట కాలువ ద్వారా ప్రవహించి తేక్కన్‌ తోట ప్రాంతంలోని 50 ఎకరాల భూములకు సాగునీరు అందుతోందన్నారు.

నటుడు మాధవన్‌ ఆ ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం ఏడు ఎకరాల భూములను కొనుగోలు చేశారనీ, ఆ తర్వాత మాధవన్‌ వర్గీయులు ఆ పంట కాలువను ఆక్రమించుకుని విద్యుత్‌ కంచెను ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. అంతే కాకుండా అక్కడి పొరంబోకు భూములను కూడా ఆక్రమించుకున్నారన్నారు. రెవెన్యూ అధికారులు సినీనటుడు మాధవన్‌కు అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. తమ భూములను కూడా విక్రయించమంటూ మాధవన్‌ వర్గీయులు తమపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. పంటకాలువను, కాలినడక మార్గాన్ని, పొరంబోకు భూములను ఆక్రమించుకున్న మాధవన్‌పై, ఆయనకు వత్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. దీనిపై విచారణ జరపాలని జిల్లా యంత్రాగం ఉత్తర్వులు జారీ చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhavan  Tamil hero  land grabbing  Case  

Other Articles