Naga Chaitanya Latest Flick Saahasam Swaasaga Saagipo Teaser Released | Gautham Menon | AR Rahman Songs

Naga chaitanya saahasam swaasaga saagipo teaser release gautham menon ar rahman

naga chaitanya, saahasam swaasaga saagipo teaser, naga chaitanya updates, gautham vasudev menon, ar rahman

Naga Chaitanya Saahasam Swaasaga Saagipo Teaser Release Gautham Menon AR Rahman : Akkineni Naga Chaitanya's Latest Flick Saahasam Swaasaga Saagipo Teaser Has Released.

చైతూ.. ‘టీజర్’లో ఎక్కడా సాహసం కనిపించలేదు!

Posted: 08/29/2015 06:48 PM IST
Naga chaitanya saahasam swaasaga saagipo teaser release gautham menon ar rahman

ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన గౌతం మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం తెరకెక్కుతోంది. ‘దోచేయ్’ తర్వాత చైతూ నటిస్తున్న ఈ చిత్రాన్ని రచయిత కోనవెంకట్ నిర్మిస్తున్నారు. తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో దర్శకుడు గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. తమిళంలో శింబు, తెలుగులో చైతూ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ రెండు భాషల్లోనూ మంజిమ హీరోయిన్ గా నటిస్తోంది.



ఇదిలావుండగా.. నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోపాటు టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ లో టైటిల్ కి తగ్గట్టు అంతగా సాహసమైతే ఏమీ కనిపించడం లేదు. ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా అనిపించిందికానీ.. టీజర్ లో మాత్రం ఆ సాహసం ఎక్కడా లేదు. ఇదిలావుండగా.. చైతూ, గౌతమ్ కాంబినేషనల్ లో ఇదివరకే ‘ఏమాయ చేసావే’ చిత్రం రూపొందింది. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతోపాటు ఇద్దరికీ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే కాంబోలో తెరకెక్కుతున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం.. ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందో, లేదో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga chaitanya  saahasam swaasaga saagipo  ar rahman  

Other Articles