Lavanya Tripathi Expressed Her Wishes | Lavanya Tripathi Glamour Roles | Pawan Kalyan | Mahesh Babu | Telugu Movies

Lavanya tripathi wish glamour roles pawan kalyan mahesh babu combination movies

Lavanya Tripathi, Lavanya Tripathi hot photos, Lavanya Tripathi hot photo shoot, Lavanya Tripathi photo gallery, Lavanya Tripathi news, Lavanya Tripathi press meet, Lavanya Tripathi press conference, Lavanya Tripathi updates, Lavanya Tripathi gallery, Lavanya Tripathi photo shoot, Lavanya Tripathi news, bhale bhale magadivoy movie, pawan kalyan, mahesh babu

Lavanya Tripathi Wish Glamour Roles Pawan Kalyan Mahesh Babu Combination Movies : Lavanya Tripathi Expressed Her Wishes. She Wants To Play Glamour Roles To Attrack Youth. The Second Wish Is She Wants To Act With Pawan Kalyan And Mahesh Babu.

‘ప్చ్.. నాకు ఆ అవకాశం ఎప్పుడొస్తుందో?’

Posted: 08/29/2015 05:01 PM IST
Lavanya tripathi wish glamour roles pawan kalyan mahesh babu combination movies

మనసులో ఏదైనా కోరిక తలచుకున్నప్పుడు ‘ఏం నాయనా.. లడ్డూ కావాలా?’ అనే ప్రశ్న ప్రతిఒక్కరికి మెదులుతుంది. ఆ కోరికలు నెరవేరకపోయినప్పటికీ.. ఆ ఊహ మాత్రం చాలా అందంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో తీరుతాయనే నమ్మకం కూడా వుంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. లావణ్య త్రిపాఠీ మదిలోనూ కొన్ని కోరికలు వున్నాయట. ఆమెకు ప్రతిరోజూ కలలో ‘ఏమ్మా.. లడ్డూలు కావాలా?’ అనే ప్రశ్న మెదులుతుంటోందని చెప్పుకొచ్చింది. ఆ కోరికలు నెరవేరే రోజు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తోందట. ఇంతకీ ఆమె కోరికేంటి..? అని అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

ప్రస్తుతం ఇండస్ట్రీలో జోరుమీదున్న యువహీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడికి.. ఆ తర్వాత అవకాశాలు అంతగా రాలేదు. ఆమధ్య ఒకటో, రెండో సినిమాల్లో కనిపించింది కానీ.. అంతగా గుర్తింపు దక్కలేదు. కానీ.. ఇప్పుడు వరుసగా అవకాశాలు ఆమె గుమ్మం ముందు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే నాని సరసన ఈమె నటించిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం సెప్టెంబర్ 4వ తేదీన విడుదలకు సిద్ధంగా వుంది. అలాగే.. కింగ్ నాగార్జునతో జోడి కట్టి ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది. ఇక వీటితోపాటు ఈమె ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ (లోల్) అని చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా వున్న ఈ అమ్మడు.. తాజాగా తన మనసులోని మాటను బయటపెట్టింది.

తనకు కేవలం హోమ్లీగా వుండే పాత్రలే ఎక్కువగా వస్తున్నాయనీ.. గ్లామర్ రోల్స్ కూడా చేసి యూత్ ని మెప్పించాలని వుందని లావణ్య స్టేట్ మెంట్ ఇచ్చింది. అంటే.. తాను కూడా ఎక్స్ పోజింగ్ చేయడానికి రెడీ అని చెప్పకనే చెప్పేసిందన్నమాట. అంతేకాదు.. తెలుగునాట టాప్ హీరోలుగా కొనసాగుతున్న పవన్ కల్యాణ్, మహేష్ బాబు ఇద్దరితో కలిసి నటించాలని వుందని అంటోంది. ఈమె కోరుకున్న రెండు కోరికల్లో అంటే.. గ్లామర్ పాత్రలైతే దక్కుతాయి కానీ, ఆ స్టార్ హీరోలతో కలిసి జోడీగా నటించే అవకాశాలు లభించడం కష్టమేనని అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lavanya Tripathi  Mahesh Babu  Pawan Kalyan  Bhale Bhale Magadivoy Movie  

Other Articles