Akhil Akkineni | First Look | Teaser Release Date | VV Vinayak | Nithin | Sayesha saigal

Akhil movie teaser release date

Akhil Movie First Look Teaser Release Date, Akhil Akkineni Movie First Look Released, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie First Look Teaser Release Date, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie Latest Updates, Akhil Akkineni Movie news, Akhil Akkineni Movie details, Akhil Akkineni Movie stills, Akhil Akkineni Movie posters, Akhil Akkineni Movie videos, Akhil Akkineni Movie making stills, Akhil Akkineni Movie making videos

Akhil Movie Teaser Release Date: Akhil Akkineni latest film under VV Vinayak Direction. Sayesha saigal heroine. hero nithin producer. Anoop and Thaman Music directors.

పవర్ ఆఫ్ సూర్యుడిగా వస్తున్న అఖిల్

Posted: 08/28/2015 05:48 PM IST
Akhil movie teaser release date

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘అఖిల్’ అనే పేరును ఖరారు చేసి, ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. టైటిల్ ‘అఖిల్’ అనే కాకుండా కింద ట్యాగ్ లైగ్ ‘పవర్ ఆఫ్ జువా’ అని కూడా పెట్టడంతో ఈ విషయంపై అక్కినేని అభిమానులు ‘జువా’ అంటే ఏంటా అని సోషల్ మీడియాలో తెగ ఆరా తీస్తున్నారు.

ప్రముఖ కమర్షియల్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సయేశా సైగల్ హీరోయిన్. అనూప్, థమన్ సంగీతం అందిస్తున్నారు.

అయితే అభిమానులు ఆరా తీస్తున్న ఆ ‘జువా’ అనే ప్రశ్నకు నిర్మాత నితిన్ వివరణ ఇచ్చారు. ‘జువా’ అంటే సూర్యుడు అని అర్థం. ఆఫ్రికాకు చెందిన స్వాహిలి భాషలో జువా అంటే సూర్యుడు అని అర్థమని నితిన్ క్లారిటీ ఇచ్చేసాడు. కానీ మళ్లీ ఈ ఆఫ్రికాకు ‘అఖిల్’ సినిమాకు గల సంబంధం ఏంటా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు.

రేపు ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయనున్నారు. అలాగే సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆడియో విడుదల చేసి, అక్టోబర్ 21న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil Akkineni  First Look  Teaser Release Date  VV Vinayak  Nithin  Sayesha saigal  

Other Articles