Rudramadevi | Hindi Rights | Sold Out | Anushka | Allu Arjun | latest posters | Trailers

Rudramadevi movie hindi rights sold out

Rudramadevi Movie Hindi Rights Sold Out, Rudramadevi Movie Latest Poster, Rudramadevi movie news, Rudramadevi movie updates, Rudramadevi stills, Rudramadevi movie posters, Rudramadevi details, Rudramadevi censor, Rudramadevi release date, Rudramadevi

Rudramadevi Movie Hindi Rights Sold Out: Director Gunasekhar latest film Rudhramadevi. Anushka, Rana, And Allu Arjun is doing a special role. This historic story gets more energy now, with Megastar Chiranjeevi becoming part of it. Chiranjeevi Garu has narrated the story of Rudhramadevi In the movie. Rudhramadevi movie Written, Produced and Directed by Gunasekhar.

అమ్ముడుపోయిన రుద్రమదేవి హిందీ హక్కులు

Posted: 08/28/2015 04:15 PM IST
Rudramadevi movie hindi rights sold out

అందాల భామ అనుష్క, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘రుద్రమదేవి’. శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో గుణా టీం వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ దర్శకనిర్మాణం రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషలలో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్ర హిందీ వర్షెన్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. హిందీలోని అభిషేక్ పిక్చర్స్ – రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు వరల్డ్ వైడ్ హిందీ వెర్షన్ రైట్స్ ని సుమారు 22 కోట్లకి సొంతం చేసుకోవడం విశేషం.

అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ చిత్ర హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఇలా అన్ని ఏరియాలలో ‘రుద్రమదేవి’ చిత్రానికి మంచి బిజినెస్ జరుగుతుండటంతో గుణశేఖర్ చాలా సంతోషంగా వున్నాడు. నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఆడియో ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

సెప్టెంబర్ 4వ తేదిన ‘రుద్రమదేవి’ని విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర విడుదలను సెప్టెంబర్ 17కు వాయిదా వేసినట్లుగా తెలిసింది. ఈ చిత్రాన్ని 3D ఫార్మెట్ లో కూడా విడుదల చేయబోతున్నారు. అందువల్ల డిజిటల్ గ్రాఫిక్స్ విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్ర కొత్త విడుదల తేదిని అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudramadevi  Hindi Rights  Sold Out  Anushka  Allu Arjun  latest posters  Trailers  

Other Articles