Amitabh Bachchan Remembers the Day When He Almost Lost His Life

Amitabh bachchan coolie accident was a rebirth

amitabh bachchan, coolie, amitabh bachchan accident, amitabh bachchan hospital, big b accident, big b coolie, amitabh bachchan coolie, coolie accident, accident in coolie, amitabh bachchan news, entertainment news

Amitabh Bachchan remembers his rebirth today, 33 years after he suffered a near-fatal accident on ‘Coolie’ and thanked all those who prayed for him 33 years ago.

అది పునర్జన్మే.. అప్పుడే నా తండ్రి కన్నీళ్లను చూశా..

Posted: 08/02/2015 11:50 PM IST
Amitabh bachchan coolie accident was a rebirth

ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత గాయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ గాయం బారిన పడిన సమయంలో తన తండ్రి కళ్లలో కన్నీళ్లు వచ్చాయని ఆయన గుర్తు చేసుకుననారు. బాలీవుడ్ చిత్రం కూలీ షూటింగ్ సందర్భంగా ప్రమాదం బారిన తనకు కోలుకోవడం నిజంగా పునర్జన్మతో సమానమని పేర్కోన్నారు. హిందీ చిత్రసీమలో హీరోగా అప్పట్లో మంచి క్రేజును సంపాదించిన అమితాబ్ చిత్రాలంటే.. ఒక్క భారత దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో మంచి కలెక్షన్లు రాబట్టాయి. ముఖ్యంగా అమితాబ్ చిత్రాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా..? అని ఆరబ్ దేశాలు ఆసక్తిగా ఎదురుచూసేవి.

అయితే 33 ఏళ్ల క్రితం జరిగిన కూలీ చిత్రం షూటింగ్ లో భాగంగా గాయపడిన సమయంలో ఈ ప్రమాదం నుంచి తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. కూలి ప్రమాద ఘటన వివరాలను ఇన్నాళ్లకు మళ్లీ గుర్తు చేసుకున్న అమితాబ్ తన ట్విట్టర్ లో తెలియజేశారు. తాను అస్పత్రి నుంచి ఇంటికి వచ్చాక తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ కన్నీళ్ల పర్యంతమయ్యారని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి కళ్లలో తాను కన్నీళ్లు చూడటం అదే తొలిసారని అమితాబ్ ట్విట్ చేశాడు. తండ్రి నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోను అమితాబ్ పోష్ట్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amitabh bachchan  coolie  twitter  

Other Articles