Tripura movie dubbing process started

Tripura movie dubbing process started

Swathi Tripura movie dubbing process started, Swathi Tripura movie latest news, Swathi Tripura movie updates, Swathi Tripura movie stills, Swathi Tripura movie latest updates, Swathi latest stills, Swathi movie news, Swathi movies, Swathi stills, Swathi

Tripura movie dubbing process started: actress swathi latest film tripura. Raj kiran director. Latest Horror Thriller movie in Tollywood as Tripura Telugu Movie Teaser in HD Motion Poster Swathi Reddy, Naveen Chandra, Kona Venkat.

డబ్బింగ్ మొదలుపెట్టిన స్వాతి త్రిపుర

Posted: 07/28/2015 09:02 AM IST
Tripura movie dubbing process started

స్వాతి టైటిల్ రోల్ లో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న చిత్రం 'త్రిపుర'. తెలుగు, తమిళ ('తిరుపర సుందరి') భాషల్లో ఏకకాలంలో జె.రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయ్యింది. త్వరలో పాటల చిత్రీకరణ ఆరంభం కానుంది. ఈ పాటలను బెంగళూరులోని హంపీ, బదామీలో చిత్రీకరించనున్నారు.

ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ - "ప్లాన్ చేసిన ప్రకారమే షూటింగ్ జరుగుతోంది. ఇటీవల డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టాం. అవి కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. అవుట్ పుట్ సంతృప్తికరంగా ఉంది. ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ చిత్రంలో స్వాతి నటన హైలైట్ గా నిలుస్తుంది'' అని చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ - ''పూర్తయినంతవరకు రషెస్ చూశాం. చాలా బాగా వచ్చింది. స్వామి రారా, కార్తికేయ విజయాల తర్వాత స్వాతి చేసిన చిత్రం ఇది. ఈ చిత్రంతో స్వాతి హ్యాట్రిక్ సాధించడం ఖాయం. సినిమా అంత బాగా వచ్చింది. 'గీతాంజలి'కన్నా అద్భుతంగా వచ్చింది. సప్తగిరి చేసిన కామెడీ హైలైట్ గా నిలుస్తుంది. ఇందులో ఆయనది ఫుల్ లెంగ్త్ రోల్. ఆ పాత్రకు సంబంధించిన చిత్రీకరణకు 25 రోజులు పట్టింది. పిల్లలు, పెద్దలు అందరూ చూడదగ్గ ఎంటర్ టైనర్ ఇది'' అని చెప్పారు.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్, కథ-దర్శకత్వం: రాజకిరణ్, సమర్పణ: జె.రామాంజనేయులు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swathi  Tripura  dubbing started  movie news  stills  trailer  

Other Articles