Baahubali Film Anti Piracy Press Meet

Baahubali film anti piracy press meet

Baahubali Movie Anti Piracy Press Meet, Baahubali Movie Anti Piracy, Baahubali Anti Piracy, Baahubali Movie interviews, Baahubali Latest release trailer, Baahubali Movie Tickets Online Booking, Baahubali release date, Baahubali movie stills, Baahubali news, Baahubali, Baahubali posters, Baahubali stills, Baahubali trailers, Baahubali songs, Baahubali videos, Baahubali teasers, Baahubali latest news, Baahubali latest stills, Baahubali latest updates, Baahubali movie details, Baahubali movie cast and crew, Baahubali online booking, Baahubali tickets, Baahubali show, Baahubali special show, Baahubali online booking, Baahubali posters, Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, SS Rajamouli

Baahubali Film Anti Piracy Press Meet: SS Rajamouli Baahubali film release on 10 july. Baahubali Movie Team Arrange Anti Piracy Press Meet. Baahubali hero Rana, Producer Shobhu yarlagadda.

బాహుబలి యాంటీ పైరసీ ప్రెస్ మీట్

Posted: 07/07/2015 03:00 PM IST
Baahubali film anti piracy press meet

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం మొదటి భాగం ఈనెల 10వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున్న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సంధర్భంగా చిత్ర యూనిట్ తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ మీడియా సమావేశం

రసభసాగా మారింది. ఈ సమావేశంలో దర్శకుడు రాజమౌళి, నటుడు రానా, చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డలతో పాటు ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, డివివి దానయ్య తదితరులు పాల్గొన్నారు.

‘బాహుబలి’ చిత్రాన్ని పైరసీ కాకుండా అడ్డుకోవాలిన రాజమౌళి, అల్లు అరవింద్ విన్నవించారు. అయితే ఈ సంధర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు రాజమౌళి ఒకింత అసహనం వ్యక్తం చేసారు. టికెట్ల ధర ఎక్కువగా వుండటం వల్లనే పైరసీ విస్తరిస్తోందంటూ మీడియా వారు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలపై రాజమౌళి తనదైన శైలిలో కాస్త ఘాటు సమాధానమిచ్చారు.

ఈ ప్రశ్నకు రాజమౌళి మాట్లాడుతూ... గతంలో టికెట్స్ తక్కువ వున్న రోజుల్లో కూడా పైరసీ వుంది... మరి అప్పుడు ఎందుకు పైరసీ జరిగింది అంటూ రాజమౌళి మీడియా వారిని ఎదురు ప్రశ్నించారు. దీంతో సమావేశం కాస్త రసాబసగా సాగింది. అయితే వెంటనే నిర్మాత అల్లు అరవింద్ ఈ విషయంలో కలుగజేసుకొని ‘బాహుబలి’ చిత్రాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సింది మీడియా వారే... కాబట్టి.. అనవసరంగా మీకు మాకు మధ్య వాగ్వాదం ఎందుకు? దయచేసి మాకు సహకరించండి అంటూ పరిస్థితిని చల్లబరిచే ప్రయత్నం చేసారు.

అయితే ‘బాహుబలి’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో కొన్ని ఛానెల్స్, పత్రికా వాళ్లకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తున్నారని కొంతమంది మీడియా ప్రతినిథులు ప్రశ్నించగా... నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ... షెడ్యూల్ ప్రకారం అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తున్నామని తెలిపారు. ‘బాహుబలి’ థియేటర్లలో చూడాల్సిన సినిమా అని, సెకండ్ షో తర్వాత పైరసీ జరుగుతోందని, పైరసీకి వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని రాజమౌళి కోరారు.

అలాగే అల్లు అరవింద్ మాట్లాడుతూ... దయచేసి సినిమాను పైరసీ చేయవద్దని, పైరసీకి పాల్పడకుండా థియేటర్లలో కట్టడి చేయాలని అన్నారు. ‘బాహుబలి’ తెలుగు వారు గర్వపడే సినిమా, ఎవరైనా పైరసీకి పాల్పడితే మానిటరింగ్ సెల్ కు తెలియజేయాలని, ఒకవేళ ఎవరైరనా ఉద్దేశ్య పూర్వకంగా పైరసీ చేస్తే

థియేటర్లపై ఏడాది పాటు నిషేదం వుంటుందని ఈ సంధర్భంగా అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Anti Piracy  Press Meet stills  Prabhas  Rana  Trailers  

Other Articles