Kalyan Ram Sher Movie Photo Teaser Released

Kalyan ram sher movie photo teaser released

Kalyan Ram Sher Movie Photo Teaser, Kalyan Ram Sher Movie Shooting details, Kalyan Ram Sher Movie stills, Kalyan Ram Sher Movie posters, Kalyan Ram Sher Movie news, Kalyan Ram Sher Movie updates, Kalyan Ram, Sher Movie

Kalyan Ram Sher Movie Photo Teaser Released: Nandamuri kalyan ram upcoming film Sher. Photo teaser released. This film shooting completed. sonal chauhan heroine.

కళ్యాణ్ రామ్ షేర్ ఫోటో టీజర్ విడుదల

Posted: 07/06/2015 09:37 AM IST
Kalyan ram sher movie photo teaser released

‘పటాస్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘షేర్’. సాయి నిహారిక, శరత్‌చంద్‌ సమర్పణలో మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సంధర్భంగా మరికొన్ని పోస్టర్ లను విడుదల చేసారు.

అలాగే ఈ చిత్ర ఫోటో టీజర్ ను కూడా విడుదల చేసారు. ఇందులో కళ్యాణ్ రామ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. చిత్ర దర్శకుడు మల్లికార్జున్ ఈ సినిమా విశేషాలు తెలియజేస్తూ... ‘‘మా ‘షేర్‌’ కళ్యాణ్‌ రామ్‌గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కళ్యాణ్‌రామ్‌గారి కెరీర్‌లో ‘షేర్‌’ ఒక సెన్సేషనల్‌ మూవీ అవుతుంది. నందమూరి అభిమానులు పండగ చేసుకునేలా ఈ సినిమా వుంటుంది. ‘పటాస్‌’ తర్వాత మళ్ళీ కళ్యాణ్‌రామ్‌గారు ఈ సినిమాలో విజృంభించి నటించారు’’ అన్నారు.

నందమూరి కళ్యాణ్‌రామ్‌ సరసన సోనాల్‌చౌహాన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి కథ, మాటలు డైమండ్‌ రత్నబాబు అందిస్తున్నాడు. థమన్‌ సంగీతం సమకూరుస్తున్నాడు. సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్‌, నిర్మాత: కొమర వెంకటేష్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మల్లికార్జున్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kalyan Ram  Sher Movie  Photo Teaser  Posters  

Other Articles