Vinodam 100% Movie Audio Release Updates

Vinodam 100 movie audio release updates

Vinodam 100% Audio Release on july 3rd week, Vinodam 100% movie news, Vinodam 100% movie stills, Vinodam 100% movie updates, sampoornesh babu movie news, sampoornesh babu latest news, sampoornesh babu latest updates, sampoornesh babu movie details, sampoornesh babu

Vinodam 100% Movie Audio Release Updates: burning star sampoornesh babu upcoming film Vinodam 100%. this film Audio Release on july 3rd week.

వినోదం 100% ఆడియో విడుదల వివరాలు

Posted: 07/04/2015 05:05 PM IST
Vinodam 100 movie audio release updates

ఎస్‌.ఎస్‌. సెల్యులాయిడ్స్‌ పతాకంపై శ్రీరామ్‌మూర్తి దర్శకత్వంలో విజయ్‌ భరత్‌, అశ్విని, కాంచనలు హీరో హీరోయిన్‌లుగా పొట్నూరి శ్రీనివాసరావు నిర్మిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘వినోదం 100%’. ఈ చిత్రంలో బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు, బాయిలింగ్‌ స్టార్‌ పృథ్వీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డబ్బింగ్‌ మరియు ఎడిటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ఆడియో ఆవిష్కరణ జరుపుకోనుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పొట్నూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ..‘100% వినోదం పంచే అద్భుతమైన చిత్రమిది. యూత్‌ అండ్‌ ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకర్షించే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఈ చిత్రంలో బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు, బాయిలింగ్‌ స్టార్‌ పృథ్వీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వాళ్ళ నటన, కామెడీ ఈ చిత్రానికి హైలెట్‌ గా ఉంటుంది. ప్రస్తుతం డబ్బింగ్‌, ఎడిటింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూలై మూడవ వారంలో ఆడియో ఆవిష్కరణ జరిపి, వెంటనే మూవీని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..’ అన్నారు.

బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు, బాయిలింగ్‌ స్టార్‌ పృథ్వీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ భరత్‌, అశ్విని, కాంచన, సత్యం రాజేష్‌, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, తాగుబోతు రమేష్‌ తదితరులు ముఖ్య తారాగణం. సాంకేతిక నిపుణులు: సంగీతం: సుభాష్‌ ఆనంద్‌, కథ: జయకుమార్‌, మాటలు: అంజన్‌, పాటలు: చిర్రావూరి విజయ్‌కుమార్‌,కృష్ణచిన్ని, కెమెరా: మల్లిఖార్జున్‌, ఎడిటింగ్‌: రాంబాబు, నిర్మాత: పొట్నూరి శ్రీనివాసరావు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీరామ్‌మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sampoornesh babu  Vinodam 100%  Movie News  

Other Articles