Baahubali movie post production works updates

Baahubali movie post production works updates

Baahubali movie post production updates, Baahubali release date, Mahesh babu, Srimanthudu, Baahubali movie stills, Baahubali news, Baahubali, Baahubali posters, Baahubali stills, Baahubali trailers, Baahubali songs, Baahubali videos, Baahubali audio, Baahubali heroines, Baahubali teasers, Baahubali latest news, Baahubali latest stills, Baahubali latest updates, Baahubali movie details, Baahubali movie cast and crew, Baahubali online booking, Baahubali tickets, Baahubali show, Baahubali special show, Baahubali online booking, Baahubali movie latest posters, Baahubali posters, Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, Baahubali movie trailers, SS Rajamouli

Baahubali movie post production works updates: prabhas latest film baahubali will be release on 10 july. Rajamouli director. prabhas, rana, tamannah, anushka acts in lead roles.

శరవేగంగా బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్ పనులు

Posted: 07/02/2015 09:50 AM IST
Baahubali movie post production works updates

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ సినిమాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిని దాటిపోయాయి. ఈ చిత్రం ఈనెల 10వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా జరుగుతూనే వున్నాయి.

ప్రస్తుతం ముంబైలో ‘బాహుబలి’ రీ-రికార్డింగ్ పనులు జరుగుతుండగా, హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఆధ్వర్యంలో డీఐ పనులు జరుగుతున్నాయి. త్వరత్వరగా ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేపనిలో పడ్డారు చిత్ర యూనిట్. సినిమా విడుదలకు ఇంకా 8 రోజుల సమయం మాత్రమే వుండటంతో ఈ పనులను మరింత వేగవంతం చేసారు.

‘బాహుబలి’ పేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రలో,  రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రభాకర్, అడవి శేష్ లు ముఖ్య పాత్రలలో నటించారు. భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్ రికార్డులను బద్దలుకొట్టేసి, కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కీరవాణి అందించిన పాటలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. దాదాపు 4వేలకు పైగా థియేట్లర్లలో ‘బాహుబలి’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అలాగే జపాన్ లో కూడా ‘బాహుబలి’ చిత్రాన్ని తమిళ వర్షెన్ లో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Rajamouli  Prabhas  Tickets  Trailer  Songs  

Other Articles