AR Rahman next 99 songs

Ar rahman next 99 songs

AR Rahman next film 99 songs, AR Rahman 99 songs, AR Rahman 99 songs film, AR Rahman latest news, AR Rahman movies, AR Rahman movie updates, AR Rahman movie stills, AR Rahman hot news, AR Rahman

AR Rahman next 99 songs: Music Director AR Rahman next film 99 songs. AR Rahman latest updates, news, movies, details, stills, gallery.

99 పాటలతో వస్తున్న ఏఆర్ రెహమాన్

Posted: 06/30/2015 01:23 PM IST
Ar rahman next 99 songs

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కొత్త వారిని ప్రొత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెహమాన్ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అందరూ కొత్తవారే నటించనున్నారు. అలాగే ఈ చిత్రానికి విశ్వేష్ కృష్ణమూర్తి అనే ప్రముఖ రంగస్థల నటుడు, నృత్య కళాకారుడు దర్శకత్వం వహించనున్నాడు.

సంగీత నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హిందీ, తమిళం భాషలలో ఏకకాలంలో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి హిందీలో ‘99 సాంగ్స్’ అని, తమిళంలో ‘99 పాడల్ గళ్’ అనే టైటిల్ ను నిర్ణయించారు. ఈ సినిమా కోసం ఇప్పటికే రెహమాన్ ఐదు పాటల కంపోజింగ్ పూర్తి చేసారట. మిగిలిన 5 పాటలను అతి త్వరలోనే పూర్తి చేసి, షూటింగ్ ప్రారంభించనున్నారని తెలిసింది.

ఈ చిత్రాన్ని ఏఆర్ రెహమాన్ తన సొంత బ్యానరైన ఏఆర్ రెహమాన్ వైఎంసీ బ్యానర్లో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నప్పటికీ భవిష్యత్తులో మాత్రం తన బ్యానర్లో వచ్చే చిత్రాలకు కొత్త సంగీత దర్శకులకు కూడా అవకాశం ఇవ్వనున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AR Rahman  99 songs  movie news  songs  

Other Articles