Mahesh Babu | Productions House Started

Mahesh babu productions house started

Mahesh Babu Started a Productions House, Mahesh Babu Productions House, Mahesh Babu production started, Srimanthudu First Look Poster Released, Srimanthudu First Look Poster, Mahesh Srimanthudu First Look Poster, Srimanthudu First Look, Mahesh Srimanthudu First Look, Srimanthudu Movie First Look, Srimanthudu Movie, Mahesh Babu, Srimanthudu First Look

Mahesh Babu Productions House Started: Tollywood prince Mahesh babu Started a Productions House. G. Mahesh Babu Entertainment Pvt. Ltd is the production house name. MB is logo.

శ్రీమంతుడుతో ప్రారంభించిన ప్రొడక్షన్ హౌస్

Posted: 05/29/2015 03:26 PM IST
Mahesh babu productions house started

హీరో మహేష్ బాబు త్వరలోనే ఓ సొంత ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించబోతున్నట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలన్నీ పుకార్లేనని అందరూ కొట్టిపారేసారు. ఎందుకంటే మహేష్ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించి సినిమాలు నిర్మించేంత సమయం లేదని, ప్రస్తుతం మహేష్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడని, అందుకే ప్రొడక్షన్ హౌస్ పై వస్తున్న వార్తలన్నీ ఉత్త పుకార్లేనని సినీవర్గాల వారు, అభిమానులు కొట్టిపారేసారు.

కానీ అందరికి షాక్ ఇచ్చే విధంగా మహేష్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించేసాడు. ‘G. Mahesh Babu Entertainment Pvt. Ltd’ పేరుతో మహేష్ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించాడు. తాజాగా మహేష్ నటిస్తున్న ‘శ్రీమంతుడు’ ఫస్ట్ లుక్ పోస్టర్ పై మహేష్ ప్రొడక్షన్ లోగోను కూడా ముద్రించి విడుదల చేసారు.

ఈ లోగోలో కనిపిస్తున్న కుర్రాడు మహేష్ బాబు తనయుడు గౌతమ్. మరి ఈ ప్రొడక్షన్లో ఎలాంటి సినిమాలు నిర్మించనున్నారో త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ‘శ్రీమంతుడు’ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియా సైట్లలో తెగ హల్చల్ చేస్తోంది. మీరు ఓ లుక్కేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Productions House  Srimanthudu  First Look Poster  

Other Articles