Mahesh Babu | Srimanthudu First Look Poster

Mahesh babu srimanthudu first look poster released

Mahesh Babu Srimanthudu First Look Poster Released: Mahesh Babu upcoming film Srimanthudu first look released today. koratla shiva direction, devi sri prasad music.

Mahesh Babu Srimanthudu First Look Poster Released: Mahesh Babu upcoming film Srimanthudu first look released today. koratla shiva direction, devi sri prasad music.

శ్రీమంతుడు ఫస్ట్ లుక్ విడుదల... ఏం వున్నాడ్రా బాబు!

Posted: 05/29/2015 02:00 PM IST
Mahesh babu srimanthudu first look poster released

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31న విడుదల చేయబోతున్నారనే విషయం అందరికి తెలిసిందే. అయితే మే 31న విడుదలవ్వాల్సిన ఫస్ట్ లుక్ పోస్టర్ ముందుగానే వచ్చేసినట్లుగా అనిపిస్తోంది.

‘శ్రీమంతుడు’ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ తాజాగా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఈనెల 31న విడుదల చేయబోతున్నట్లుగా మైత్రీ మూవీస్ అధికారికంగా ప్రకటించారు.

కానీ రెండు రోజులు ముందుగానే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఇందులో మహేష్ చాలా సింపుల్ గా వున్నాడు. ఒకప్పుడు ‘ఒక్కడు’ సినిమాలో మహేష్ ఎంత సింపుల్ గా కనిపించాడో... మళ్లీ చాలా కాలం తర్వాత మహేష్ ఈ ‘శ్రీమంతుడు’ చిత్రంలో అంత సింపుల్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే వున్న అంచనాలు ఈ లుక్ తో మరింతగా పెరుగుతున్నాయి.

ఈ ఫస్ట్ లుక్ తో అభిమానులు ఫుల్ ఖుషీలో వున్నారు. మహేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ నటుడు జగపతి బాబు, నటి సుకన్య, నటుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Srimanthudu First Look Poster Released-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  First Look Poster  

Other Articles