Pawan Kalyan | Gabbar Singh 2 Movie | Shooting Started

Pawan kalyan gabbar singh 2 movie shooting started

Pawan Kalyan Gabbar Singh 2 Movie shooting, Pawan Kalyan Gabbar Singh 2 Movie stills, Pawan Kalyan Gabbar Singh 2 news, Pawan Kalyan Gabbar Singh 2 shooting details, Pawan Kalyan Gabbar Singh 2 movie news, Pawan Kalyan Gabbar Singh 2 movie updates, Pawan Kalyan Gabbar Singh 2 movie started, Pawan Kalyan Gabbar Singh 2

Pawan Kalyan Gabbar Singh 2 Movie Shooting Started: Powerstar Pawan kalyan latest upcoming film Gabbar singh2. this film launched today. Bobby director, Sharth marar producer, devi sri prasad music.

సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చేసిన గబ్బర్ సింగ్2

Posted: 05/29/2015 12:59 PM IST
Pawan kalyan gabbar singh 2 movie shooting started

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. టాలీవుడ్ రికార్డులను షేక్ చేస్తూ, పవర్ స్టార్ ఇమేజ్ తారాస్థాయికి పెంచేసిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంకు సీక్వెల్ గా ‘గబ్బర్ సింగ్2’ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. ‘గబ్బర్ సింగ్2’ సెట్స్ పైకి ఎంట్రీ ఇచ్చేసాడు.

‘పవర్’ సినిమాతో దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించిన బాబీ దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్2’ చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ నేడు లాంచనంగా ప్రారంభమయ్యింది. ఇందులో పవన్ సరసన అనీషా అంబ్రోస్ తొలిసారిగా హీరోయిన్ గా జతకడుతోంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు, నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక మరియు చిత్ర లొకేషన్ల ఎంపిక పూర్తయ్యాయి. దీంతో ఈ చిత్ర షూటింగ్ ను శరవేగంగా, నిరవధికంగా జరుపనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ స్టార్ట్ చేసేసాడు. ‘గబ్బర్ సింగ్’ కంటే 10రెట్లు ఎక్కువగా ‘గబ్బర్ సింగ్2’ పాటలు మరియు రీరికార్డింగ్ వుండే విధంగా దేవి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

భారీ అంచనాలతో రూపొందనున్న ఈ చిత్రంలోని ఓ కీలక సన్నీవేశం కోసమే పవన్ భారీగా జుట్టు, గడ్డం, మీసాలు పెంచారని తెలిసింది. ముందుగా ఆ సన్నీవేశాలకు సంబంధించిన చిత్రీకరించి.. ఆ తర్వాత మళ్లీ కొత్త లుక్ లో పవన్ ను చూపించబోతున్నారని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan Gabbar Singh 2 Movie Shooting Started  

Other Articles