Salman Khan tweets | Bajrangi Bhaijan

Salman khan latest tweets about his fans

Salman Khan latest tweets, Salman Khan tweets, Salman Khan movie news, Salman Khan movie updates, Salman Khan latest updates, Salman Khan stills, Salman Khan hot news, Salman Khan movie posters, Salman Khan

Salman Khan Latest tweets about his fans: Bollywood star hero salman khan tweets on his twitter. Salman Khan latest tweets, news, gossips, stills, gallery.

అభిమానుల కోసం సల్మాన్ కొత్తగా ట్వీట్

Posted: 05/29/2015 11:51 AM IST
Salman khan latest tweets about his fans

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన అభిమానులకు మరో శుభవార్తను అందించాడు. ఇటీవలే తన కొత్త సినిమా ‘భజ్రంగీ భైజాన్’ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ ను విడుదల చేసి ఆనందపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈసారి తన సోషల్ మీడియా అభిమానులకు ఓ గిఫ్ట్ ఇవ్వనున్నాడు.

సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఎప్పుడూ అభిమానులకు అందుబాటులో వుంటాడనే విషయం తెలిసిందే. తన వ్యక్తిగత మరియు సినిమా వివరాలు ఆ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వుంటాడు. కానీ ఇప్పటి వరకు ఆ వివరాలన్నీ కూడా కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే పోస్ట్ చేసాడు. కానీ ఇక నుంచి హిందీ మరియు ఉర్దూ భాషలలో కూడా తాను పోస్ట్ చేయనున్నట్లుగా సల్మాన్ సోషల్ మీడియా ట్విట్టర్లో ప్రకటించాడు.

ప్రస్తుతం సల్మాన్ నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న ‘భజ్రంగీ భైజాన్’ చిత్ర టీజర్ బాలీవుడ్ లో హల్చల్ చేస్తుంది. ఇందులో సల్మాన్ చాలా సింపుల్ అండ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సల్మాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Latest Tweets  Bhajrangee Bhaijaan  

Other Articles