Baahubali Trailer | Dolby Atmos sound | SS Rajamouli

Baahubali movie trailer in dolby atmos sound

Baahubali trailer in Dolby Atmos sound, Baahubali trailer details, Baahubali trailer updates, Baahubali movie news, Baahubali latest news, Baahubali movie stills, Baahubali movie news, Baahubali

Baahubali Movie Trailer in Dolby Atmos sound: SS Rajamouli Upcoming film Bahubali. “Baahubali” will be launched with cutting edge Dolby Atmos surround sound. MM Keeravani Music.

విడుదలకు ముందే ఒక రికార్డ్ క్రియేట్ చేసాడా?

Posted: 05/27/2015 03:56 PM IST
Baahubali movie trailer in dolby atmos sound

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘బాహుబలి’ చిత్రంపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఈ చిత్రాన్ని హిందీలో ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర తెలుగు వర్షెన్ ట్రైలర్ ను ఈనెల 31న విడుదల చేయనున్నారు.

అయితే ఈ ట్రైలర్ కు ఓ స్పెషల్ ఎలిమెంట్ ను జతచేసారు. ఈ ట్రైలర్ ను కటింగ్ ఎడ్జ్ డాల్బీ ఎట్మాస్ మిక్సింగ్ అనే హై క్వాలిటీ సౌండ్ తో అందించనున్నారు. తెలుగులో తొలిసారిగా ఈ టెక్నాలజీని ‘బాహుబలి’ కోసం వాడటం జరిగింది. ఈ సౌండ్ మిక్సింగ్ భాద్యతలను ప్రముఖ సౌండ్ ఇంజనీర్ పి.ఎం.సతీష్ చూసుకుంటున్నారు. ట్రైలర్ విడుదలకు ముందే ఇలా రికార్డులకు క్రియేట్ చేస్తుందంటే... ఇక సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేయనుందో చూడాలి.

‘బాహుబలి’ హిందీ వర్షెన్ ట్రైలర్ ను జూన్ 1వ తేదిన విడుదల చేయనున్నారు. రెండు నిమిషాల 5 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ అద్భుతంగా వుందని ఇప్పటికే చూసినవారి నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. మరి ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనుందో త్వరలోనే తెలియనుంది.

కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను ఈనెల 31న హైటెక్స్ లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. అలాగే జులై 10న తెలుగు, తమిళ, హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ‘బాహుబలి - ది బిగెనింగ్’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Trailer  Dolby Atmos sound  SS Rajamouli  

Other Articles