Adha Sharma injured | Garam movie Shooting

Adha sharma injured in garam movie shooting

Adha Sharma injured, Adha Sharma injured in Garam, Adha Sharma latest news, Adha Sharma hot news, Adha Sharma injured news, Adha Sharma hospitalized, Adha Sharma accident news, Adha Sharma accident, Adha Sharma in hospital, Adha Sharma latest updates, Adha Sharma latest stills, Adha Sharma

Adha Sharma injured in Garam movie Shooting: Adah Sharma latest upcoming film Garam. aadi hero, Madhan Director. Adah sharma injured in garam movie shooting spot.

తీవ్ర గాయాలపాలైన గరం హీరోయిన్ ఆదాశర్మ

Posted: 05/27/2015 11:53 AM IST
Adha sharma injured in garam movie shooting

‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ ఆదాశర్మ. ‘హార్ట్ ఎటాక్’ తర్వాత ఈ అమ్మడికి అనుకున్న స్థాయిలో ఆఫర్లేమి రాలేదు. కానీ అల్లు అర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఓ చిన్న పాత్రలో నటించింది. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలో ఓ గెస్ట్ పాత్రలో నటించనుంది.

ప్రస్తుతం ఆదితో కలిసి ‘గరం’ సినిమాలో హీరోయిన్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఆదాశర్మకు తీవ్ర గాయాలైనట్లుగా తెలిసింది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఆదా ప్రమాదవశాత్తూ ఓ బైక్ రైడ్ నుంచి కిందపడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఓ బస్సు ఆమెను బలంగా ఢీ కొట్టడంతో... ఆదాకు తీవ్ర గాయాలైనట్లుగా తెలిసింది.

దీంతో చిత్ర బృందం వెంటనే ఆదాను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆదా ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం హాస్పిటల్లో ఆదా చికిత్స పొందుతోంది. ఆదా పరిస్థితి తీవ్రంగానే వున్నట్లుగా వార్తలొస్తున్నాయి. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

ప్రముఖ దర్శకుడు మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆపేసారు. తాజాగా మళ్లీ ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించారు. కానీ ఈ సమయంలో హీరోయిన్ ఆదాకు ఇలా ప్రమాదం జరగడంతో చిత్ర యూనిట్ చాలా భాదపడుతున్నారు. మరి ఆదా త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Adha Sharma  Injured  Hospitalized  Garam movie  Aadi  

Other Articles