Balakrishna | Dictator Movie | Updates

Balakrishna dictator movie latest updates

Balakrishna Dictator Movie Latest Updates, Balakrishna Dictator Movie news, Balakrishna Dictator Movie updates, Balakrishna Dictator Movie stills, Balakrishna Dictator Movie details, Balakrishna Dictator news, Balakrishna latest news, Balakrishna 99 film, Balakrishna latest film news, Balakrishna film updates, Balakrishna

Balakrishna Dictator Movie Latest Updates: Nandamuri Balakrishna Latest Film Dictator. Srivas Direction, Anjali heroine. Thaman Music.

బాలయ్య డిక్టేటర్ చిత్ర తాజా వివరాలు

Posted: 05/25/2015 10:50 AM IST
Balakrishna dictator movie latest updates

నందమూరి బాలకృష్ణ నటించిన ‘లయన్’ సినిమా అన్ని చోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా కొన్న డిస్టిబ్యూటర్లందరూ కూడా సేఫ్ అయినట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలయ్య నటించిన 98వ చిత్రం ‘లయన్’ విడుదలై అన్నిచోట్ల హౌస్ ఫుల్ షోలతో కొనసాగుతుంది.

బాలయ్య తన 99వ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేస్తున్నాడు. శ్రీవాస్ దర్శకత్వంలో బాలయ్య తన 99వ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘డిక్టేటర్’ అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో హీరోయిన్ గా అంజలిని ఖరారు చేసారు. తాజాగా ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసారు.

అంజలి ఇప్పటికే అగ్ర హీరో వెంకటేష్ సరసన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మసాలా’ చిత్రాల్లో నటించింది. ఇపుడు బాలయ్య సినిమాలో అవకాశం రావడంతో చాలా సంతోషంగా వుంది. ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్టు పనులు, ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ వారు నిర్మిస్తున్నారు.

కోన వెంకట్, గోపి మోహన్, బివిఎస్ఎన్ రవి, శ్రీధర్ సీపాన, డైమండ్ రత్నంలు సంయుక్తంగా స్ర్కిప్టును సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఈనెల 29న ఘనంగా జరుగనున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.


డిక్టేటర్ చిత్ర నటీనటులు:
నందమూరి బాలకృష్ణ
అంజలి (హీరోయిన్)
నాజర్, బ్రహ్మానందం, రవికిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృధ్వీ, కాశీ విశ్వనాథ్, సుప్రీత్, అమిత్ తదితరులు.

సాంకేతికవర్గ నిపుణులు:
ప్రొడ్యూసర్ : ఈరోస్ ఇంటర్నేషనల్
డైరెక్టర్ & సహనిర్మాత : శ్రీవాస్
కథ, స్క్రీన్ ప్లే : కోన వెంకట్, గోపి మోహన్
మాటలు : ఎం. రత్నం
రచన : శ్రీధర్ సీపాన
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్యామ్.కె.నాయుడు
సంగీతం : థమన్.ఎస్.ఎస్.
ఎడిటర్ : గౌతం రాజు
ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మాకడలి
ఫైట్స్ : రవివర్మ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Anjali  Dictator  Srivas  Film News  

Other Articles