Amitabh Bachchan Cautions Twitter Followers Against Fake Account in His Name

Amitabh bachchan warns fans against his fake twitter account

Amitabh Bachchan warns fans, Amitabh Bachchan Cautions Twitter Followers, amitabh bachchan, big b, big b account, amitabh bachchan news, amitabh bachchan films, amitabh bachchan movies, amitabh bachchan roles, National News, Entertainment News, Amitabh Bachchan fake Twitter account,

Megastar Amitabh Bachchan has asked his fans not to follow a fake account in his name on micro-blogging website Twitter

అభిమానులను హెచ్చరించిన అమితాబ్

Posted: 05/24/2015 07:32 PM IST
Amitabh bachchan warns fans against his fake twitter account

తన అభిమానులకు హెచ్చరికలు జారీ చేసిన బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తనకు ట్విట్ కు లభించిన స్పందనకు ఉప్పోంగిపోయారు. అతి తక్కువ సమయంలో తన ట్విట్టర్ ఫాలోవర్లు తన హెచ్చరికలపై స్పందించి తీరుతో ఇక తన పేరుతో నకిలీ అకౌంట్ నడిపే వ్యక్తులకు దిమ్మతిరుగుతుందన్నారు. అయితే ఇక ఇలాంటి వారిపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం వుందని అన్నారు అమితాబ్. అంతకు ముందు తన పేరిట ఎవరో ఫేక్ ట్విట్టర్ ఖాతాను తెరిచారని, దానిపై తాను టిక్ చేసిన గుర్తులేదని, ఆవిషయాన్ని ఫ్యాన్స్ గుర్తించాలని చెప్పారు.

తన పేరిట వచ్చే ఫేక్ ఖాతా ద్వారా పోస్టింగ్లు నమ్మవద్దని, దానికి తాను బాధ్యుడిని కాదని చెప్పారు. హెచ్చరిక: @srbachannc.. ఇక్కడ నాపేరు చివర 'సీ' అనే అక్షరం అదనంగా యాడ్ చేసి ఉంది. ఇది ఫేక్ ఖాతా. అది తనది కాదని చెప్పాడు. ఈ విషయాన్ని అందరు గుర్తించి దానిని పట్టించుకోకుండా ఉంటే మంచిదిని అమితాబ్ చెప్పారు. సుమారుగా 15 లక్షల మంది ఫాలోవర్లు వున్న అమితాబ్ ట్విట్ చేయగానే దానిపై అప్పటికప్పుడే దాదాపు 13,800 మందికి ట్వీట్ లు తిరిగి పంపించారు. ఇప్పటికే పికు చిత్రం విజయంతో సంతోషంగా ఉన్న ఆయన వజీర్ అనే చిత్రం ద్వారా కనిపించనున్నారు. ఇందులో ఆయన పక్షవాతం సోకిన చెస్ క్రీడాకారుడిగా కనిపిస్తారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amitabh Bachchan  fans  fake Twitter account  big b  

Other Articles