Sylvester Stallone Thanks Salman for Compliment, Says 'Maybe Let's Do New Expendables Together'

Salman khan should do an action film together

sylvester stallone, salman khan, sylvester salman twitter, the expendibles, Hollywood action hero Sylvester Stallone, Bollywood superstar Salman Khan, microblogging site, Twitter, social media,

Hollywood action hero Sylvester Stallone thanked Bollywood superstar Salman Khan for complimenting him on microblogging site Twitter

సల్మాన్.. ఒక యాక్షన్ సినిమా చేద్దామా..!

Posted: 05/23/2015 08:50 PM IST
Salman khan should do an action film together

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, హాలీవుడ్ స్టార్ సిల్వస్టర్ స్టాలోన్ ఒకర్నొకరు ప్రశంసించుకున్నారు. హాలీవుడ్ స్టార్ సిల్వస్టర్ స్టాలిన్ నిజమైన హీరో అని.. తన అభిమానులు ఎవరినైనా ఫాలో అవ్వాలంటే అది ఆయననే అంటూ బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చెప్పిన మర్నాడే సల్మాన్ ఖాన్ ను ప్రశంసలతో ముంచెత్తాడు స్టాలిన్. 'అద్భుత ప్రతిభ ఉన్న భారత సూపర్ స్టార్' అంటూ సల్మాన్కు స్టాలోన్ కితాబిచ్చారు. ఇలా అవకాశం వచ్చింది కదా అని ఇద్దరు ప్రశంసలతో ముంచెత్తేసుకు్నారు. అంతే కాదండోయ్ సల్మాన్ కు అరుదైన అవకాశాన్ని కూడా కల్పించారు స్టాలిన్. అదేంటంటారా..?

ఇద్దరం కలసి ఓ యాక్షన్ సినిమా చేయాలని స్టాలిన్ ట్వీట్ చేశారు. అంతకుముందు సల్మాన్ తన ఫాలోయర్లను ఉద్దేశిస్తూ హాలీవుడ్ స్టార్ సిల్వస్టర్ స్టాలిన్ను ఫాలో కావాలని ట్వీట్ చేశారు. 'స్టాలిన్ మీ హీరోకే హీరో' అంటూ సల్మాన్ ట్విటర్లో పేర్కొన్నారు. ట్విటర్లో సల్మాన్కు కోటి 20 లక్షల మంది ఫాలోయర్లున్నారు. స్టాలిన్ సల్మాన్కు కృతజ్ఞతలు చెబుతూ ఇద్దరం కలసి ఓ సినిమా చేయాలని ఉందని ట్వీట్ చేశారు. మరి ఆ రసవత్తర వేడుకకు బాలివుడ్ వేదిక కానుందా..? లేక ఏకంగా హాలివుడ్ వేదికగా నిలవనుందా..? త్వరలోనే తేలిపోనుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sylvester Stallone  Salman Khan  Movie  

Other Articles