Balakrishna | Jagapati Babu | Boyapati Srinu | Ruler

Balakrishnas 100th film to be directed by boyapati srinu

Balakrishna, boyapati srinu, legend, simha, balayyaih, 100th movie, nandamuri nata simham, balakrishna 100 movie, balakrishna latest news, balakrishna upcomming movies, balakrishna new movies, balakrishna latest posters, boyapati srinu latest movies, balakrishna ruler movie, boyapati srinu ruler movie

director boyapati srinu to director balakrishna 100th movie titled as ruler

బాలయ్య నూరవ చిత్రానికి కలం నేరుతున్నాడు..

Posted: 05/23/2015 08:45 PM IST
Balakrishnas 100th film to be directed by boyapati srinu

నందమూరి నట సింహం బాలకృష్ణ కెరీర్లో మైలు రాయిగా నిలిచే తన 100 చిత్రానికి దర్శకత్వం వహించే చాన్సును కోట్టేసిన దర్శకుడు ఎవరో తెలుసా..? అంటే నందమూరి అభిమానులు ఓహో మాకు ఎప్పుడో తెలుసు అంటూ ఠకీ ఠకీ మని సమాధానం చెబుతారు. ఇంతకీ ఎవరాయన అనే వాళ్లు కూడా లేకపోలేదు. ఆయనే బోయపాటి శ్రీను. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి సినిమాలపై మక్కువతో దర్శకుడు ముత్యాల సుబ్బయ్య వద్ద అసిస్టెంటుగా చేరి.. తొమ్మిదేళ్లలో కేవలం ఐదు చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించిన దర్శక ధురంధరుడు.

సమరసింహారెడ్డి, నరసింహా నాయుడు తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోవడమే కాదు  వాటి రికార్డులను కూడా బద్దలు కోట్టి బాలయ్య సినీ చరిత్రలో అల్టిమేట్ హిట్ గా నిలిచిన చిత్రం సింహా. బోయపాటి శ్రీను. దర్శకత్వంలో రూపోందిన ఈ చిత్రాన్ని అభిమానులు ఎంతలా అధరించారో మనకు తెలుసు. బాలయ్య సింపుల్గా డైలాగ్ చెప్పినా డైనమేట్ లా పేలుతుందని బోయపాటి సింహాతో రుజువు చేశాడు. బాలయ్య కెరీర్లో సరికొత్త అధ్యాయం రాశాడు. అందుకే బోయపాటి శ్రీను బాలయ్య రెండో అవకాశం ఇచ్చాడు.   

సెకండ్ ఛాన్స్ తో బోయపాటి లెజెండ్ మళ్లి చరిత్ర సృష్టించింది. బాలయ్య ఇమేజ్ రేంజ్ని సరిగ్గా క్యాచ్ చేశాడు కాబట్టే బోయపాటి రెండు హిట్స్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. డెఫినెట్గా కలెక్షన్ల వర్షం కురుస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ తరుణంలో బాలయ్య తన 100 సినిమా కూడా ఈ డైరెక్టర్ చేతికి చిక్కింది. ఆ గోల్డెన్ ఛాన్స్ బోయపాటికే దక్కింది. బాలయ్య వందో సినిమా గురించి ఇప్పటినుంచే కసరత్తులు మొదలు పెట్టాడట ఇక ఈ చిత్రం ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో వేచిచూడాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  boyapati srinu  legend  simha  balayyaih  100th movie  

Other Articles