actor mohan babu lashes out on producers syndicate

Hose people are thieves not producers mohan babu

mohan babu, producers syndicate, telugu film industry, telugu cinema, Collection King Mohan Babu, Those People Are Thieves, Not Producers', Mohan Babu, Mohan Babu About Tollywood, mohan babu on producers syndicate, mohan babu lafoot comments, tollywood news

Collection King Mohan Babu slammed what he called a 'Producers Syndicate. '

సినీ లోఫర్లు, దొంగలపై మండిపడ్డ ‘పెద్దరాయుడు’

Posted: 05/23/2015 07:52 PM IST
Hose people are thieves not producers mohan babu

సినిమా ఇండస్ర్టీ ఎవడబ్బ సొత్తు కాదని, ప్రొడ్యూసర్స్ సిండికేట్ మీద సీనియర్ నటుడు మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు లక్ష్మి నటించిన దొంగాట చిత్రం సక్సెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ చిన్న సినిమాలు తీసే వాళ్లే అసలైన నిర్మాతలని అన్నారు. కొందరు పైనాన్షియర్ల సాయంతో భారీ బడ్జెట్‌ సినిమాలు తీసి నటులకు డబ్బులు ఎగ్గొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఫైనాన్షియర్లను మోసం చేసేవాడు లఫూట్ అంటూ ఆయన మండిపడ్డారు. దౌర్జన్యాలు చేసే వారు కాలగర్భంలో కలిసిపోతారని ఆయన విమర్శించారు. నిజమైన నిర్మాతలు చనిపోయారని....మంచి దర్శకులు సైతం అతి తక్కువమంది ఉన్నారన్నారు.
 
చిన్న నిర్మాతలకు ఎప్పుడూ అండగా ఉంటానని, కొందరు పెద్ద నిర్మాతలు ...చిత్ర పరిశ్రమను భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంచి సబ్జెక్ట్‌ లేక చాలా మంది నిర్మాతలను దర్శకులు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ సినిమా పరిశ్రమలో గాలి కబుర్లు ఎక్కువయ్యాయని దుయ్యబట్టారు. టాలీవుడ్‌లో ఇటీవలి పరిణామాలపై త్వరలో స్పందించనున్నట్లు తెలిపారు. సినిమా విలన్లు...నిజ జీవితంలో విలన్లు కాదని మోహన్‌బాబు తెలిపారు. సినిమాలో విలన్‌ అంటే ప్రతికథానాయకుడు అని అన్నారు. తానెప్పుడూ చిన్న నిర్మాతల పక్షానే ఉంటానని మోహన్‌బాబు స్పష్టం చేశారు. .

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mohan babu  producers syndicate  tollywood news  

Other Articles