Prabhas Bahubali | First Look Poster | Rajamouli

Prabhas bahubali first look poster

Prabhas Bahubali‬ First Look, Prabhas as Bahubali‬, Prabhas latest stills, Prabhas posters, Baahubali new posters, Baahubali new look, Baahubali movie news, Baahubali movie updates, Baahubali movie news, Baahubali movie stills, Baahubali movie latest stills, Baahubali movie latest updates, Baahubali, Prabhas

Prabhas Bahubali First Look Poster: Young Rebel Star Prabhas latest movie Bahubali. Prabhas Bahubali first look poster released today. Prabhas doing as bahubali and Shivudu roles. SS Rajamouli Direction, MM Keeravani Music. Anushka, Tamanna, Rana in lead roles.

సాహస విక్రమ ధీశాలి.. రణతంత్ర కళా కుశలి.. ఈ బాహుబలి!

Posted: 05/22/2015 04:34 PM IST
Prabhas bahubali first look poster

‘మిర్చి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రానికే పరిమితమవ్వడంతో మరో సినిమా రూపొందలేదు. ‘బాహుబలి’ సినిమా కోసం ప్రభాస్ భారీగా బరువు పెరిగాడు. అలాగే అధికంగా జుట్టు, గడ్డం, మీసాలతో ఓ నిజమైన బాహుబలి వలే సిద్ధమయ్యాడు.

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసారు. బాహుబలి, శివుడు పాత్రలలో నటించాడు. అయితే గతకొద్ది రోజులుగా ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించిన పోస్టర్ల ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాలో నటించిన ప్రధాన, కీలక నటీనటుల పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు. అదే విధంగా ప్రభాస్ శివుడు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇటీవలే విడుదల చేసారు. ఈ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా బాహుబలి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఎంతమందినైనా ఎదిరించగల గుండెదమ్మున్న వీరుడిగా ప్రభాస్ ఈ బాహుబలి లుక్ లో అదరగొడుతున్నాడు. ఈ సినిమాపై వున్న అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

తెలుగు, తమిళ ఆడియో హక్కులను ప్రముఖ లహరి మ్యూజిక్ సంస్థ భారీ మొత్తానికి దక్కించుకుంది. ఈ చిత్ర ఆడియో, థియేటర్ ట్రైలర్ ను ఈనెల 31వ తేదిన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జులై 10వ తేదిన తెలుగు, తమిళ, హిందీ భాషలలో గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Prabhas  Bahubali?  First Look Poster  Rajamouli  

Other Articles