Ram Charan | Turbomegha services | movies

Ram charan airlines services starts from june

Ram Charan airlines to start services from June, Ram Charan airlines from June, Ram Charan Turbomegha news, Ram Charan latest news, Ram Charan movie news, Ram Charan stills, Ram Charan news, Ram Charan

Ram Charan airlines services starts from June: Ram Charans airlines Tru Jet is going to kick starts in June. Turbo Megha is mainly focusing on flights to Hyderabad, Tirupati...

జూన్ చివర్లో ఎగురనున్న చెర్రీ విమానాలు

Posted: 05/05/2015 10:15 AM IST
Ram charan airlines services starts from june

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ ‘టర్బోమేఘ’ పేరుతో ఓ ఏవియేషన్ కంపెనీని గత ఏడాది జులైలో స్థాపించిన విషయం తెలిసిందే. ఈ ‘టర్బో మేఘ’కు డైరెక్టర్ గా రాంచరణ్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉమేష్ వంకాయలపాటిలు వున్నారు. చరణ్ డైరెక్టర్ గానే కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ టర్బో మేఘ విమాన సేవలు జూన్ నెల నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ విషయంపై మేనేజింగ్ డైరెక్టర్ ఉమేష్ తెలియజేస్తు... ‘ట్రూ జెట్’ పేరుతో రీజనల్ షెడ్యూల్ ఎయిర్ లైన్స్ సేవలను ప్రారంభించడానికి టర్బో మేఘ ఎయిర్‌వేస్ ఏర్పాట్లు చేస్తున్నాయని, జూన్ నెల చివర్లోగా తొలి విమానం ఎగురనుందని ధీమా వ్యక్తం చేసారు ఉమేష్. డిజిసిఏ అనుమతులు తుది దశలో వున్నాయని, అలాగే ఈ వారంలో రెండు ఏటిఆర్ ఎయిర్ క్రాఫ్టులు రానున్నాయని తెలిపారు.

టర్బోమేఘ సేవలు ఇపుడు హైదరాబాద్ కేంద్రంగా సర్వీసులను ప్రారంభించనుంది. ముందుగా దేశంలో ద్వితియ శ్రేణి నగరాలపై దృష్టిసారిస్తున్నట్లుగా ఉమేష్ తెలిపారు. టర్బో మేఘ విమాన సేవల గురించి త్వరలోనే ఓ ప్రెస్ మీట్ ద్వారా అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Turbomegha services  movies  telugu  news  

Other Articles