Madhu Shalini | Praveen sattaru | Movie news

Madhu shalini new movie in praveen sattaru direction

Madhu Shalini in praveen sattaru direction, Madhu Shalini next movie with praveen sattaru, Madhu Shalini latest news, Madhu Shalini movie news, Madhu Shalini movie updates, Madhu Shalini latest stills, Madhu Shalini hot stills, Madhu Shalini spicy stills, Madhu Shalini gossips, Madhu Shalini videos, Madhu Shalini

Madhu Shalini news movie in praveen sattaru direction: tollywood cute actress Madhu Shalini next movie with national award winning movie chandamama kathalu director Praveen sattaru.

మధుశాలినితో చందమామ కథలు డైరెక్టర్

Posted: 05/05/2015 09:52 AM IST
Madhu shalini new movie in praveen sattaru direction

ఒకప్పుడు చిన్న చిన్న సినిమాలలో హీరోయిన్ గా నటించిన నటి మధుశాలిని... ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది తప్ప... హీరోయిన్ గా మళ్లీ ఏ సినిమాలలో కనిపించలేదు. కానీ ఈ మధ్య మళ్లీ మధుశాలిని హాట్ టాపిక్ గా మారుతోంది. వరుసగా ఆఫర్లు వస్తుండటంతో బిజీ అవుతోంది.

మధుశాలిని ఇప్పటికే తెలుగులో చాలా సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. తన అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. ఇటీవలే ‘గోపాల గోపాల’ చిత్రంలో జర్నలిస్టుగా కనిపించింది. అయితే తాజాగా ఈ అమ్మడికి ఓ సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చినట్లుగా తెలిసింది.

‘చందమామ కథలు’ చిత్రానికి ఇటీవలే జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఈ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాడు.

ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన ప్రవీణ్... నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో బిజీగా వున్నాడు. ఇందులో మొదటి హీరోయిన్ గా మధుశాలినిని ఎంపిక చేసారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం మధుశాలిని ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సీతావలోకనం’ విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhu Shalini  Praveen sattaru  Movie news  

Other Articles