Rajamouli | Bahubali | Shivudu First Look

Prabhas baahubali shivudu first look poster

Baahubali Shivudu First Look Poster , Baahubali new poster release date, Baahubali first look poster, Baahubali new look, Baahubali movie news, Baahubali movie updates, Baahubali movie news, Baahubali movie stills, Baahubali movie latest stills, Baahubali movie latest updates, Baahubali, Prabhas, anushka

Prabhas Baahubali Shivudu First Look Poster: Prabhas Upcoming movie Bahubali. prabhas as shivudu in baahubali. Shivudu First Look Poster Released today. Director SS Rajamouli.

వారెవ్వా... ప్రభాస్ శివుడి ఫస్ట్ లుక్ సిరిగిపోయింది!

Posted: 05/04/2015 04:30 PM IST
Prabhas baahubali shivudu first look poster

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోయే క్షణాలు మొదలయ్యాయి. ప్రముఖ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

ఇందులో ప్రభాస్ ‘బాహుబలి’, ‘శివుడు’ అనే రెండు పాత్రలలో నటిస్తున్నాడు. బాహుబలి పాత్రకు సంబంధించిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇదివరకే విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈరోజు(మే4) శివుడు పాత్రకు సంబంధించిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఆ గంగను మోసిన జంగమదేవుని నెత్తిన
మోసినదెవడు!
నరనరమున సత్తువ ఉరకలు వేసిన
నరోత్తముడు ఎవడు!
అంటూ ‘బాహుబలి’ చిత్ర యూనిట్ ప్రభాస్ శివుడు ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.

ఇందులో ప్రభాస్ అద్భుతంగా వున్నాడు. ఓ శివలింగాన్ని ఎత్తుకొని వున్న ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ప్రభాస్ బాడీ, హెయిర్ స్టైల్ సూపర్ గా వున్నాయి. ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయిన ఈ చిత్రానికి ఈ పోస్టర్ల ద్వారా మరింత రెట్టింపు అవుతున్నాయి.

ఇక ఈనెల 31వ తేది వరకు ఇలాగే ప్రమోషన్ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను ఈనెల 31న విడుదల చేయనున్నారు. జూన్ నెల నుంచి జులై 10 వరకు భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న పాటలను జూన్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జులై నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Prabhas Baahubali Shivudu First Look Poster Released-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Rajamouli  Bahubali  Shivudu First Look  

Other Articles