Bahubali movie | trailer release date | Rajamouli | Prabhas

Bahubali movie trailer release on 31 may

Bahubali movie trailer release date, Bahubali movie trailer release date confirmed, Bahubali movie latest stills, Bahubali movie audio details, Bahubali movie audio updates, Bahubali movie audio news, Bahubali movie news, Bahubali movie updates, Bahubali movie stills, Bahubali movie

Bahubali movie trailer release on 31 May: Bahubali movie 1st part shooting completed. Prabhas, Rana, anushka, Tamannah act in lead roles. Keeravani Music. SS Rajamouli direction.

కన్ఫర్మ్: ఈసారి పక్కాగా వస్తామంటున్న జక్కన్న.. బాహుబలి ట్రైలర్ విడుదల తేది ఖరారు

Posted: 04/28/2015 12:56 PM IST
Bahubali movie trailer release on 31 may

తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బాహుబలి’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో ప్రముఖ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఇటీవలే మొదటి భాగం షూటింగ్ ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం మొదటి భాగాన్ని మే 15న విడుదల చేయబోతున్నట్లుగా గతంలో దర్శకుడు రాజమౌళి అధికారికంగా ప్రకటించారు.

కానీ గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆలస్యం అయ్యింది. అయితే ఈ విషయంపై తాజాగా రాజమౌళి అధికారికంగా ‘బాహుబలి’ మొదటి భాగం ట్రైలర్ విడుదల తేదిని ప్రకటించారు. రాజమౌళి మాట్లాడుతూ... ‘బాహుబలి’ మొదటి భాగం చిత్రాన్ని మే 15న విడుదల చేయాలనుకున్న మాట వాస్తవమే. కానీ కొన్ని గ్రాఫిక్స్ వర్క్ మరియు టెక్నికల్ వర్క్ వలన ఆలస్యం అవుతుంది. అందుకే విడుదల చేయలేకపోయాం. అయితే ఈ చిత్ర ట్రైలర్ ను మే 31వ తేదిన ఖచ్చితంగా విడుదల చేయబోతున్నాం. ఆ తర్వాత జులై నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని రాజమౌళి చెప్పుకొచ్చారు.

షూటింగ్ ఇటీవలే పూర్తవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలు అంచనాలను భారీగా పెంచేసాయి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను జూన్ నెలలో విడుదల చేయనున్నారు. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bahubali movie  trailer release date  Rajamouli  Prabhas  

Other Articles