Ram gopal varma | tweets | chiranjeevi | Sampoornesh Babu

Ram gopal varma latest tweets on chiranjeevi

Ram gopal varma hot tweets on chiranjeevi, varma hot tweets on chiranjeevi, Ram gopal varma hot tweets on Rajni kanth, Ram gopal varma hot tweets on Amithab Bacchan, Ram gopal varma hot tweets on Sampoornesh babu, Ram gopal varma hot tweets, Ram gopal varma, hot tweets

Ram gopal varma latest tweets on chiranjeevi: Director Ram gopal varma latest tweets on megastar chiranjeevi, Rajini kanth, Amithab bacchan and sampoornesh babu.

చిరంజీవి కంటే సంపూ బెటర్ అంటున్న వర్మ

Posted: 04/27/2015 10:53 AM IST
Ram gopal varma latest tweets on chiranjeevi

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మళ్లీ మెగా అభిమానులను గెలికేసాడు. గతంలో పవన్ కళ్యాన్ ను పొగుడుతూ, చిరంజీవిని తక్కువ చేసే విధంగా కామెంట్లు చేసి, మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఓ వివాదం ద్వారా వార్తల్లో నిలిచారు. వర్మ కామెంట్లకు హద్దు, అదుపులు వుండవనే విషయం అందరికి తెలిసిందే. నోటికొచ్చిందల్లా వాగేసి, ఆ తర్వాత ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ఏదో ఒక ప్రయత్నాలు చేస్తుంటాడు.

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై భారీ కామెంట్లు చేసి మెగా అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు వర్మ. మెగాస్టార్ చిరంజీవి కంటే బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు బెటర్ అంటూ వర్మ తాజాగా చేసిన కామెంట్లపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Ram gopal varma hot tweets on chiranjeevi-02

సంపూర్ణేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’. ఈ సినిమాలో సంపూ ఓ పాట పాడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సంపూను వర్మ మెచ్చుకుంటూనే చిరంజీవిని, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లను తన కామెంట్లతో కించపరిచాడు. ‘ది ఓన్లీ హీరో, రియల్ హీరో, రియల్ రియల్ హీరో సంపూర్ణేష్ బాబు... చిరంజీవి, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ ల కంటే బెటర్’ అంటూ వర్మ తన సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్ట్ చేసాడు.

దీంతో మెగా అభిమానులు వర్మపై భారీగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇతర హీరోలపై వివాదాస్పదపు కామెంట్లు చేయడం వర్మకేమి కొత్త కాదులే. అయితే త్వరలోనే సంపూతో వర్మ ఓ చిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram gopal varma  tweets  chiranjeevi  Sampoornesh Babu  

Other Articles