allari naresh | james bond movie | first look poster

Allari naresh james bond movie first look poster

allari naresh james bond movie first look, allari naresh james bond movie stills, allari naresh james bond movie posters, allari naresh james bond movie details, allari naresh james bond posters, allari naresh james bond first look, allari naresh james bond

allari naresh james bond movie first look poster: Allari naresh latest movie title James Bond. Nenu kadu na pellam is tag line. sakshi choudary heroine.

తన పెళ్లాం జేమ్స్ బాండ్ అంటున్న అల్లరోడు

Posted: 04/27/2015 09:51 AM IST
Allari naresh james bond movie first look poster

ఇటీవలే ‘బందిపోటు’ చిత్రంతో నవ్వించిన నటుడు అల్లరి నరేష్ తాజాగా మరో కామెడీ చిత్రంతో మనముందుకు రాబోతున్నాడు. అల్లరి నరేష్ హీరోగా ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ చిత్రంలో చెల్లెలికి భయపడే అన్న పాత్రలో నటించిన, అందరిని నవ్వించిన విషయం తెలిసిందే. ఇందులో నరేష్ చెల్లెలిగా హీరోయిన్ కార్తీక నటించింది. ఈ సినిమా పర్వాలేదనిపించింది.

అయితే మళ్లీ ఇలాంటి కథాంశంతోనే మరో చిత్రం తెరకెక్కతున్నట్లుగా తెలుస్తుంది. అయితే కథ, కథనం వేరు. ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ చిత్రంలో చెల్లెలికి భయపడే అన్నగా నటించిన నరేష్... ఈసారి భార్యకు భయపడే భర్తగా నటిస్తున్నాడు. నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జేమ్స్ బాండ్’. ‘నేను కాదు నా పెళ్లాం’ అనేది చిత్ర ట్యాగ్ లైన్.

తాజాగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వస్తుంది. ఇందులో నరేష్ సరసన ‘పోటుగాడు’ ఫేం సాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ పోస్టర్ ను చూస్తుంటే సాక్షి చౌదరి లేడీ జేమ్స్ బాండ్ గా వుంటూ, నరేష్ కు చుక్కలు చూపించేస్తుందేమోనని అనిపిస్తోంది.

ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సాయి కిషోర్ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allari naresh  james bond movie  First look poster  

Other Articles