producer bellamkonda suresh says no one vandalised his office

Producer bellamkonda suresh clarifies on accident

producer bellamkonda suresh car rammed in to a youth, Movies, producer bellamkonda suresh filmnagar office vandalised by localites, bellamkonda, producer bellamkonda suresh, car driver, tollywood, tollywood latest news, film nagar, car dasesh youth, driver on run, youth greviously injured

Senior producer Bellamkonda Suresh is in a serious trouble after his car hit a youngster at Road no 7 in Filmnagar, Hyderabad. The greviously injured

నన్ను ఎవరూ కోట్టలేదు అంటున్న గంగ నిర్మాత

Posted: 04/26/2015 06:50 PM IST
Producer bellamkonda suresh clarifies on accident

హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో వున్న నిర్మాత బెల్లంకోండ సురేష్ కార్యాలయంపై అకస్మాత్తుగా స్థానికులు దాడికి పాల్పడ్డారని, ఆయనపై కూడా దాడికి దిగారని వచ్చిన వార్తల్లో నిజం లేదని స్వయంగా నిర్మాత బెల్లంకోండ సురేష్ చెబుతున్నారు. స్థానికులు కార్యాలయం అద్దాలతో పాటు లోపల వున్న ఫర్నీఛర్ ను కూడా ధ్వంసం చేశారన్న వార్తలు సత్యదూరమన్నారు. ఫిలింనగర్ రోడ్ నెంబర్ 7లో రోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడిని బెల్లంకోండ సురేష్ వాహనం వేగంగా వచ్చి ఢీకొనింది. ఈ ఘటనలో యువకుడు గాయపడ్డాడు. దీంతో రెచ్చిపోయిన స్థానికులు ఆయన కార్యాలయంపై దాడి చేశారని ప్రచారం జరిగింది.

అయితే గంగ చిత్రం రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బెల్లంకోండ.. జరిగిన ఘటనపై కూడా స్పందించారు. ఇదంతా తప్పుడు ప్రచారమని ఆయన ఆ వార్తలను తోసిపుచ్చారు. తన కారుని కానీ, ఆఫీస్‌ని కానీ ఎవరూ ఎటాక్‌ చేయలేదని, తనని మ్యాన్‌ హ్యాండిల్‌ చేసారనే పుకార్లలో నిజం లేదని, ఇలాంటి సున్నిత విషయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా, నిజానిజాలు ఏమిటనేది వాకబు చేయకుండా పబ్లిష్‌ చేయడం బాధ్యతారాహిత్యమని సదరు వార్తలని ప్రచారం చేసిన మీడియాకి చురకలు వేసారు. ఏది నిజమో..? ఏది అబద్దమో..? తెలియకుండా వార్తాలు ప్రచురించడం తప్పేకదండీ..!

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bellamkonda suresh  car dasesh youth  driver on run  

Other Articles